చాన్నాళ్ల తర్వాత గత ఏడాది క్రాక్ రూపంలో మంచి విజయాన్ని అందుకున్నాడు మాస్ రాజా రవితేజ. కానీ ఆ ఆనందం ఆయనకు ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండు చిత్రాలు ఆయనను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అందులో ఒకటి ఖిలాడి కాగా.. ఇంకోటి రామారావు ఆన్ డ్యూటీ.
ఖిలాడి కనీసం ఓపెనింగ్స్ అయినా తెచ్చుకుంది, మాస్ ప్రేక్షకులను కొంత మేర మెప్పించింది. కానీ రామారావు ఆన్ డ్యూటీ మాత్రం అన్ని రికాలుగా నిరాశపరిచింది. మాస్ రాజా కెరీర్లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుని అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచిందా చిత్రం. ఈ దెబ్బతో రవితేజ ఇలాంటి ప్రయోగాత్మక, తన ఇమేజ్‌కు సరిపడని సినిమాల జోలికే వెళ్లడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ యంగ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రం చేయడానికి మాస్ రాజా రెడీ అయినట్లు తెలుస్తోంది. కార్తీక్ ఇంతకుముందే ఓ హాలీవుడ్ సినిమా ఆధారంగా సూర్య వెర్సస్ సూర్య అనే చిత్రం తీశాడు. అది పర్వాలేదనిపించింది. కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాకపోవడంతో మళ్లీ ఛాయాగ్రహణానికే పరిమితం అయ్యాడు కార్తీక్. ఇప్పుడతను మాస్ రాజాతో సినిమా తీయబోతున్నాడట. తన స్క్రిప్టుకు రవితేజ ఓకే చెప్పాడట. ఇందులో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనుందట.
ఐతే చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఓ హాలీవుడ్ హిట్‌కు ఫ్రీమేక్ అట. ఆ సినిమా.. జాన్ విక్ అంటున్నారు. ఇందులో హాలీవుడ్ స్టార్ కియాను రీవ్స్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా ఒక వైవిధ్య కథాంశంతో తెరకెక్కింది. మరణించిన తన భార్య తనకు చివరి బహుమతిగా ఇచ్చిన కుక్కపిల్లను చంపేసి, తనకెంతో ఇష్టమైన కారును దొంగిలించుకుని వెళ్లిన దుండగులను వేటాడే వ్యక్తి కథ ఇది. దీన్ని ఇండియనైజ్ చేసి కమర్షియల్ ఫార్మాట్లో తీయడానికి కార్తీక్ రెడీ అయినట్లు సమాచారం.
This post was last modified on September 14, 2022 8:54 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…