భాష ఏదైనా హీరోలకు మార్కెట్ పెరగాలంటే మాస్ సపోర్ట్ చాలా అవసరం. అది లేకపోతే ఎన్ని సినిమాలు చేసినా రేంజ్ ఒక స్థాయికే పరిమితమవుతుంది. కాకపోతే ఏ సమయంలో చేయాలని నిర్ణయించుకోవడం కీలకం. అలా కాకుండా తొందరపడితే ఏం జరుగుతుందో ముందే చెప్పలేం కానీ జాగ్రత్తగా ఉండటం మాత్రం అవసరమే. కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఈ నెల 16న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ చేతుల మీద ట్రైలర్ లాంచ్ చేయించారు. ఓ మోస్తరుగా ఉన్న బజ్ కు దీని వల్ల కొంత ఊపొచ్చింది.
ఇదంతా బాగానే ఉంది కానీ కిరణ్ అయిదో సినిమాకే ఫుల్ మాస్ గా ట్రై చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీనే గమనిస్తే ఒకపక్క తండ్రి కూతుళ్ళ ఎమోషన్, మరోపక్క క్యాబ్ డ్రైవర్ గా హీరో యాక్షన్ ప్లస్ కామెడీ, ఇంకోవైపు పంచె గళ్ళలుంగీ కట్టుకుని విలన్ లాంటి మామకు ఛాలెంజ్ విసరడాలు అంతా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లా అనిపిస్తోంది. హీరోయిన్ సంజన లుక్స్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేవు. ఆల్రెడీ రిలీజ్ చేసిన రెండు లిరికల్ వీడియోల్లో మణిశర్మ బ్రాండ్ ఊర మాస్ ట్యూన్లు సాహిత్యమే వినిపించింది. ఇదంతా గమనిస్తే ఎలా అయినా మాస్ ని మెప్పించాలనే తాపత్రయమే కనిపిస్తోంది.
ఎస్ఆర్ కళ్యాణ మండపంతో ఊహించిన దానికన్నా చాలా పెద్ద హిట్టు కొట్టిన కిరణ్ కు అందులో మాస్ ఎలిమెంట్సే దాని విజయానికి కారణమని బలంగా నమ్ముతున్నట్టు ఉంది. దాని రిలీజ్ టైమింగ్, ఫాదర్ ఎమోషన్, కరోనా తర్వాత పెద్ద స్కేల్ లో ప్లాన్ చేసుకోవడం లాంటి సానుకూలంశాలు సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. పైగా పాటలు చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. మరి నేను మీకు బాగా కావాల్సిన వాడినిలో ఆ స్థాయిలో పండాయా అనేది చూడాలి. అసలే సగమయ్యాక దర్శకుడు మారాడు. తనకు హిట్టిచ్చిన శ్రీధర్ గాదెని తిరిగి తెచ్చుకోవడంలో కిరణ్ స్ట్రాటజీ ఎంత వర్కౌట్ అవుతుందో 16న తేలనుంది.
This post was last modified on September 8, 2022 9:45 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…