బాయ్‌కాట్.. బాయ్‌కాట్.. కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న మాట ఇది. కొంతమంది అదే పనిగా బాలీవుడ్ సినిమాలను టార్గెట్ చేస్తూ.. వాటిని బహిష్కరించాలని సోషల్ మీడియాలో పిలుపునివ్వడం.. ఆ చిత్రాల గురించి ప్రతికూల ప్రచారం చేయడం.. నెగెటివ్ టాక్‌ను స్ప్రెడ్ చేయడం చూస్తూనే ఉన్నాం.
లాల్ సింగ్ చడ్డా, షంషేరా లాంటి చిత్రాలపై ఈ ప్రభావం కొంత మేర పడిందన్నది వాస్తవం. దీంతో వీరిని చూసి బాలీవుడ్ భయపడే పరిస్థితి వచ్చింది. ఈ బ్యాచ్‌ను ఎలా డీల్ చేయాలో తెలియక బాలీవుడ్ పెద్దలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. వారి భయం చూసి బాయ్‌కాట్ బ్యాచ్ మరింత రెచ్చిపోయి.. రిలీజవుతున్న ప్రతి సినిమానూ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. వాళ్లు లక్ష్యంగా చేసుకున్న కొత్త చిత్రం.. బ్రహ్మస్త్ర.
బాలీవుడ్లో నెపోటిజం బ్యాచ్ అంతా కలిసి చేస్తున్న సినిమా అని.. రణబీర్, ఆలియా గతంలో ఏవో కామెంట్లు చేశారని.. సినిమాలోని ఒక సన్నివేశంలో రణబీర్ చెప్పులేసుకుని గుడిలోకి వెళ్లాడని.. ఇలా ఏవేవో కారణాలు చెప్పి ఈ సినిమాను బాయ్‌కాట్ లిస్టులోకి చేర్చారు. రోజులు, వారాల తరబడి ఈ సినిమాను టార్గెట్ చేస్తూ ట్రెండ్ నడిపిస్తున్నారు. కానీ ఈ ప్రభావం సినిమా మీద పెద్దగా ఏమీ పడుతున్నట్లు కనిపించడం లేదు. బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్స్ మాంచి జోరు మీద నడుస్తున్నాయి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ ఛైన్లలో 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూళ్లు రూ.10 కోట్ల మార్కును కూడా దాటేశాయి. ఈ ట్రెండ్ చూస్తే బ్రహ్మాస్త్రకు వరల్డ్ వైడ్ తొలి రోజు రూ.25 కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు వచ్చేలా కనిపిస్తోంది. అంటే బాయ్‌కాట్ బ్యాచ్ అప్పీల్‌ను జనం ఏమాత్రం పట్టించుకోవట్లేదని.. ఆల్రెడీ బజ్ తక్కువగా ఉన్న సినిమా మీద ఇంకా నెగెటివిటీ పెంచడం తప్పితే.. ప్రేక్షకులు మెచ్చే సినిమాను ఏమీ చేయలేరనడానికి ఇది రుజువు. లైగర్ సినిమా విషయంలో కూడా ఎంత ప్రయత్నించినా విడుదలకు ముందు హైప్‌ను తగ్గించలేకపోయారు. సినిమా బాలేకపోవడంతోనే దాని గురించి నెగెటివిటీని స్ప్రెడ్ చేయగలిగారన్నది స్పష్టం.
This post was last modified on September 7, 2022 7:08 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…