తన స్నేహితుడు, దర్శకుడు రాజమౌళి ఇచ్చిన ఛాలెంజ్‌ను పూర్తి చేసేశాడు తారక్. ‘మన ఇంట్లో ప్రేమలు, ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం’ అంటూ తన వంతుగా సీనియర్ స్టార్లకు ‘బి ది రియల్ మ్యాన్’ సవాల్ విసిరాడు తారక్. మెగాస్టార్ చిరంజీవి, ‘కింగ్’ నాగార్జున, ‘విక్టరీ’ వెంకటేశ్‌తో పాటు బాబాయ్ బాలయ్య, దర్శకుడు కొరటాల శివలను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేశాడు ఎన్టీఆర్. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా, అబ్బాయ్ విసిరిన ఛాలెంజ్‌కు బాబాయ్ స్పందిస్తాడా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎన్నోరోజులుగా బాబాయ్- అబ్బాయ్ మధ్య సంబంధాలు సరిగా లేవని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కుటుంబ సంబంధమైన విషయాలతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని రాజకీయాలు ఈ ఇద్దరి మధ్య చిచ్చు రేగడానికి కారణమని అంటారు. హరికృష్ణ మరణం తర్వాత బాబాయ్, అబ్బాయ్ మధ్య దూరం మరింత పెరిగింది. బాలయ్యబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన ‘ఎన్.టీ.ఆర్’ బయోపిక్‌లో తారక్ కనిపించలేదు. తారకరాముడి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ పాత్రలో తారక్ నటిస్తారనే టాక్ వినిపించినా, అది కేవలం రూమర్‌గానే మిగిలింది. ‘ఎన్.టీ.ఆర్’ వేడుక తర్వాత ఎక్కడా ఈ ఇద్దరూ కలిసి కనిపించలేదు కూడా.
ఈ వార్తలను పట్టించుకోకుండా ‘బాలా బాబాయ్’ అంటూ ప్రేమగా పిలుస్తూ… బాలయ్యనే ముందుగా ఈ ఛాలెంజ్‌కు నాటినేట్ చేశాడు తారక్. అబ్బాయి ఛాలెంజ్‌కు బాలకృష్ణ స్పందిస్తే కనుక నందమూరి అభిమానులు పండగ చేసుకోవడం గ్యారెంటీ. ‘ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ను బాలయ్య స్వీకరించి, ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ విషయాన్ని పక్కనబెడితే నిన్నటితరంలో టాప్ స్టార్లు అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణలను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసి తారక్ అద్భుతమైన స్టెప్ తీసుకున్నాడని అంటున్నారు ఫ్యాన్స్. వీరిలో నందమూరి బాలకృష్ణ ఒక్కడే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. తారక్ ఛాలెంజ్‌కు స్పందించిన దర్శకుడు కొరిటాల శివ… ‘ఛాలెంజ్ స్వీకరిస్తున్నా అన్నయ్యా… నెలరోజుల ఫుటేజ్ మిస్ అయ్యింది ఆల్రెడీ’ అంటూ రిప్లై ఇచ్చాడు.
This post was last modified on April 22, 2020 1:42 pm
ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం…
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…