Movie News

సల్మాన్ వెంకీ సినిమాపై ట్రోలింగ్

కండల వీరుడు సల్మాన్ ఖాన్ విక్టరీ వెంకటేష్ తొలిసారి కలిసి నటిస్తున్న కిసీకో భాయ్ కిసీకో జాన్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీడియో బయటికి రావడం ఆలస్యం వెంటనే ట్రోలింగ్ మొదలైపోయింది. కారణం లేకపోలేదు. సల్మాన్ జుత్తు మరీ కృత్రిమంగా ఉండటం, ఏదో స్టైలిష్ గా కనపడాలనే తాపత్రయం తప్ప నిజంగా ఆ పాత్ర అలాంటి డిమాండ్ చేసిందాని అనుమానం వచ్చేలా డిజైన్ చేశారు. అంతే ఇదేం జుత్తు భాయ్ అంటూ నెటిజెన్లు ఆడుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడో తేరే నామ్ తర్వాత సల్లు భాయ్ జులపాలతో కనిపించలేదు.

ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. వెంకటేష్ ఆమె అన్నయ్యగా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ముందు కభీ ఈద్ కభీ దీవాలి టైటిల్ అనుకుని ఫైనల్ గా కొత్తదానికి లాక్ అయ్యారు. ఈ సినిమా వెనుక పలు ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. ముంబై మీడియా ప్రకారం మూల కథ అజిత్ వీరం నుంచి తీసుకున్నారట. అంటే దీన్ని రీమేక్ చేసిన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు లైన్ అన్నమాట. కొద్దిమార్పులతో బాలీవుడ్ ఆడియన్స్ అభిరుచులకు తగినట్టు దర్శకుడు ఫహద్ సంజి కొత్తగా ఏదో ట్రై చేశారట. అవేంటనేది డిసెంబర్ లో రిలీజైతే కానీ క్లారిటీ రాదు.

ఈయనే అక్షయ్ కుమార్ తో గద్దలకొండ గణేష్ రీమేక్ ని బచ్చన్ పాండేగా చెడగొట్టింది.మరి ఇప్పుడు సల్మాన్ వెంకీ ఇద్దరికీ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఆ మధ్య చిరంజీవి గాడ్ ఫాదర్ టీజర్ వచ్చినప్పుడు సైతం ఆ వీడియో చివర్లో సల్లు భాయ్ ఫేస్ ని విఎఫ్ఎక్స్ లో చూపించడం కామెంట్స్ కి దారి తీసింది. ఇప్పుడీ కిసీకా భాయ్ కిసీకా జాన్ వంతు వచ్చింది. అన్నట్టు ఇందులో జగపతిబాబు కూడా ఉన్నాడండోయ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ తో కంపోజ్ చేయిస్తున్నారు. ఒక పాట దేవిశ్రీ ప్రసాద్ కి ఇచ్చి మిగిలినవి మరో ముగ్గురు కంపోజర్స్ తో కొట్టిస్తున్నారు.

This post was last modified on September 6, 2022 2:04 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

41 mins ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

2 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

3 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

5 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

6 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

6 hours ago