మాములుగా పెద్ద హీరోల సినిమాలే హిట్ టాక్ వచ్చినా మహా అయితే రెండు మూడు వారాలకు మించి స్ట్రాంగ్ రన్ కొనసాగించలేని పరిస్థితిలో సీతారామం లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీకి వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఒక కేస్ స్టడీలాగా తీసుకోవచ్చు. ఇటీవలే హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తే అక్కడా మంచి స్పందన దక్కుతోంది. థియేటర్లలో చూసిన వాళ్ళు తమ ఫీడ్ బ్యాక్ ని చాలా పాజిటివ్ గా ట్వీట్ల రూపంలో పెడుతున్నారు. ఇంత ఆలస్యంగా ఎందుకు తీసుకొచ్చారని నిలదీస్తున్న వాళ్ళు లేకపోలేదు. తమిళ మలయాళంలో ఈ స్థాయి రెస్పాన్స్ కాదు కానీ డీసెంట్ గా పే చేయడంలో మాత్రం ఫెయిల్ కాలేదు.
టాలీవుడ్ లో స్టార్ వేల్యూ లేని దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తో దర్శకుడు హను రాఘవపూడి ఆవిష్కరించిన అద్భుతం తాలూకు ఫలితమిది. ఇక ఇప్పుడు అందరి దృష్టి సీతారామం ఓటిటి రిలీజ్ మీద ఉంది. విశ్వసనీయ వర్గాలు చెబుతున్న ప్రకారం అమెజాన్ ప్రైమ్ దీని ప్రీమియర్ ని సెప్టెంబర్ 9కి ప్లాన్ చేసుకుందట. ఇది ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా లాక్ చేసుకున్న డేట్ గా చెబుతున్నారు. మాములుగా ప్రైమ్ ఇలాంటివి ఫిక్స్ చేసుకున్నప్పుడు జస్ట్ ఒకటి రెండు రోజుల ముందు మాత్రమే ప్రమోషన్లు మొదలుపెడుతుంది.
సో నిజంగా ఆ డేట్ కి స్ట్రీమింగ్ ఉంటుందా లేదా అనేది చెప్పలేం. హిందీలో రన్ బాగుంది కాబట్టి కొంతకాలం వాయిదా వేస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పోకిరిలో పండుగాడులా ప్రైమ్ ఒక్కసారి కమిట్ అయితే తన మాట తనే వినదు. గత ఏడాది పుష్ప పార్ట్ 1 ఇరవై రోజులకే వరల్డ్ ప్రీమియర్ చేసినప్పుడు ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కు తగ్గలేదు. రూల్ రూలే అని పెట్టేసింది. మరి సీతారామంకు సైతం అలాగే చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. కాకపోతే బాలీవుడ్ వెర్షన్ ని కొంత లేట్ చేయొచ్చు. ఏదైనా అఫీషియల్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. వెయిట్ అండ్ సీ.
This post was last modified on September 4, 2022 6:22 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…