దక్షిణాదిన కొత్త తరం నటుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజయ్ సేతుపతి అనడంలో సందేహం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అతను అదరగొట్టేస్తాడు. ఇటీవలే ‘విక్రమ్’ సినిమాలో సంతానం పాత్రలో అతను ఎంత గొప్పగా నటించాడో, సినిమాకు ఎంత బలంగా నిలిచాడో తెలిసిందే. అలాంటి నటుడు తన సినిమాలో ఉండాలని, తన కోసం మంచి పాత్ర రాయాలని ప్రతి దర్శకుడూ కోరుకుంటాడు. తమిళ దర్శకుడైన అట్లీ.. హిందీలో చేయబోతున్న తొలి చిత్రం కోసం విజయ్ సేతుపతినే విలన్‌గా ఎంచుకోవడం విశేషం.
‘జవాన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలక పాత్రలకు తమిళ నటులనే తీసుకుంటున్నాడు అట్లీ. ఈ క్రమంలోనే విలన్‌గా విజయ్ సేతుపతిని, కథానాయికగా నయనతారను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ చిత్రానికి విజయ్ సేతుపతి తీసుకోనున్న పారితోషకం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
‘జవాన్’లో విలన్ పాత్ర పోషించడానికి విజయ్ ఏకంగా రూ.21 కోట్లు పుచ్చుకోనున్నట్లు చెబుతున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో దీని గురించి తెగ ప్రచారం జరుగుతోంది. కానీ నిజంగా సేతుపతికి అంత రేంజ్ ఉందా అన్నది ప్రశ్న. తన బేస్ అయిన తమిళంలో హీరోగా నటించినా సరే.. సేతుపతి అందులో సగం కూడా తీసుకోడని అంటారు. తన పారితోషకం పది కోట్లకు అటు ఇటుగా ఉంది.
ఇక విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తే వర్కింగ్ డేస్ ఎలాగూ తగ్గుతాయి కాబట్టి రేటు ఇంకా తగ్గుతుంది. తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంలో విలన్ పాత్రకు గాను రూ.5 కోట్ల దాకా పుచ్చుకున్నట్లు సమాచారం. అలాంటిది ఎంత హిందీ మూవీ అయితే మాత్రం ఏకంగా రూ.21 కోట్లు ఇచ్చేస్తారా అన్నది సందేహం. అందులోనూ ఈ మధ్య బాలీవుడ్ సినిమాల మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. పెద్ద పెద్ద సూపర్ స్టార్ల సినిమాలకు కూడా దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. ఇలాంటి టైంలో సేతుపతి ఒక్కడికే రూ.21 కోట్లు అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు.
This post was last modified on August 30, 2022 9:58 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…