తెలుగులో మంచి అభిరుచి, భావుకత ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల పేరు ముందు వరుసలో ఉంటుంది. సున్నితమైన అంశాలతో ఆహ్లాదకరమైన సినిమాలు తీస్తాడని శేఖర్‌కు పేరుంది. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా.. ఇలా ప్రతి సినిమాలోనూ శేఖర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇందులో చివరి రెండు చిత్రాలతో శేఖర్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడనే చెప్పాలి. చిన్న సినిమాలుగా రిలీజైన హ్యాపీడేస్, ఫిదా చాలా పెద్ద విజయమే సాధించాయి.
‘ఫిదా’ తర్వాత శేఖర్ మీద భారీ అంచనాలు ఏర్పడగా.. నాగచైతన్య-సాయిపల్లవిల కలయికలో ఆయన రూపొందించిన ‘లవ్ స్టోరి’కి విడుదల ముంగిట భలే హైప్ వచ్చింది. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఒక దశ వరకు సినిమా బాగానే నడిచినా.. చివరికొచ్చేసరికి ప్రేక్షకులకు మిశ్రమానుభూతి కలిగించింది. చివర్లో సినిమాను కొత్త మలుపు తిప్పడం మెజారిటీ ప్రేక్షకులకు నచ్చలేదు. ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ.. ఎక్కువమంది సినిమా సంతృప్తినివ్వలేదు.
ఐతే సినిమాఫలితం ఎలా ఉన్నా కొన్ని రోజుల తర్వాత కొత్త సినిమా మీదికి వెళ్లిపోవడం కామన్. ఐతే శేఖర్ సినిమాకు, సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటాడు. స్క్రిప్టు పని నెమ్మదిగా చేస్తాడు. ఐతే ‘లవ్ స్టోరి’ తర్వాత ఆయన చేయాల్సింది పాన్ ఇండియా మూవీ. అందులో ధనుష్ హీరో. ఈ సినిమా గురించి గత ఏడాది ఘనంగా ప్రకటన చేశారు. కానీ ఇప్పుడీ చిత్రం మీద అనుమానాలు ముసురుకుంటున్నాయి. దీని తర్వాత అనౌన్స్ చేసిన ‘సార్’ సినిమాను ధనుష్ చకచకా పూర్తి చేసేస్తున్నాడు.
తమిళంలో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. కొత్తవీ అనౌన్స్ చేస్తున్నాడు. కానీ శేఖర్ కమ్ముల సినిమా గురించి అతను ఎక్కడా మాట్లాడట్లేదు. ఆ సినిమా గురించి దర్శక నిర్మాతలు కూడా మౌనం వహిస్తున్నారు. ఏ అప్‌డేట్ ఇవ్వట్లేదు. ‘లవ్ స్టోరి’ ఫలితం తేడా కొట్టడం, ధనుష్ ప్రయారిటీస్ మారిపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘లవ్ స్టోరి’ రిలీజై 11 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇకనైనా శేఖర్ మౌనం వీడి తన కొత్త చిత్రం గురించి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
This post was last modified on August 20, 2022 7:40 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…