Movie News

హిందూ సెంటిమెంటుతో హిట్లు కొడుతున్నారు

హిందూ సెంటిమెంటుతో హిట్లు కొడుతున్నారుకార్తికేయ 2 అటు నార్త్ లోనూ ఇంత మంచి రెస్పాన్స్ దక్కించుకోవడానికి కారణం నిఖిల్ కున్న ఇమేజ్ కాదు, ప్యాన్ ఇండియాగా దాన్ని ప్రమోట్ చేసిన తీరూ కాదు. శ్రీకృష్ణుడి తత్వాన్ని బలంగా చూపించి భగవద్గీతలోని ఆయన సారాన్ని ఫాంటసీ డ్రామాకి జోడించిన వైనం ఉత్తరాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది, మాములుగా టీవీ సీరియల్ లో కృష్ణుడి క్యారెక్టర్ నే అమితంగా ఇష్టపడే ఆడియన్స్ కి ఇలా బిగ్ స్క్రీన్ మీద గ్రాఫిక్స్ సహాయంతో క్వాలీటీ కంటెంట్ ని ప్రెజెంట్ చేస్తే థియేటర్లకు రాకుండా ఉంటారా. ఇప్పుడదే జరిగింది.

నిజానికి మన సినిమాలు అక్కడ ఇంతగా వర్కౌట్ అవ్వడానికి కారణం హిందూ సెంటిమెంటే. ఆర్ఆర్ఆర్ రిలీజైనప్పుడు రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా చూపిస్తే ఆ గెటప్ చూసి ఢిల్లీ ముంబై జనాలు శ్రీరాముడితో పోల్చుకున్నారు. చాలా చోట్ల క్లైమాక్స్ లో ఆ పాత్ర ఎంట్రీకి జైశ్రీరామ్ అని నినాదాలు చేయడం వీడియోల రూపంలో బయటికి వచ్చింది. అఖండ హిందీలో డబ్బింగ్ చేయకపోయినా హాట్ స్టార్ లో సబ్ టైటిల్స్ సహాయంతో చూసినవాళ్లు అఘోరాగా బాలయ్య వివరించిన హిందూ మత సారాన్ని గొప్పగా మెచ్చుకున్నారు.

చూస్తుంటే రాబోయే రోజుల్లో మన దర్శకులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకునేలా ఉన్నారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకు వేసి ఒకవేళ  చిరంజీవి అంజి కనక ఇప్పుడు రిలీజై ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేదని అంచనా వేస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కోడి రామకృష్ణలు ఎప్పుడో అడ్వాన్స్ గా ఆలోచించారు కానీ వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తయ్యేనాటికి ప్రభాస్ ఆది పురుష్ తో సహా మరికొన్ని ఈ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవడం ఖాయం.

This post was last modified on August 18, 2022 2:35 am

Share

Recent Posts

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

17 minutes ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

2 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

2 hours ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

3 hours ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

3 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago