నిన్నా ఈ రోజు తెలుగులో మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2తో పాటు లాల్ సింగ్ చడ్డాలు ఉండటంతో పాటు డబ్బింగ్ చేసేందుకు తగినంత సమయం లేని కారణంగా కార్తీ కొత్త సినిమా విరుమన్ తమిళ వెర్షన్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైపోయింది. ఇక్కడా వచ్చి ఉంటే డీసెంట్ ఓపెనింగ్స్ దక్కేవి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాతలు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది.
అక్కడి సంగతి చూస్తే కార్తీకి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినట్టుగా ట్రేడ్ టాక్. లాంగ్ వీకెండ్ లో చెప్పుకోదగ్గ సినిమా ఇదొక్కటే కావడంతో మంచి ఫిగర్లే వచ్చాయట. సరే మనకు చూసే ఛాన్స్ లేకపోయినా ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఉందిగా. విరుమన్ రొటీన్ టెంప్లేట్ లో సాగే విలేజ్ డ్రామా. తల్లి చనిపోవడానికి చెడ్డవాడైన తండ్రి(ప్రకాష్ రాజ్)కారణమని భావించే హీరో అతని మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటూ పెరిగి పెద్దవుతాడు.
ఆ భావనతో ఆయన పనులకు అడ్డు తగిలేందుకు వెనుకాడడు. ఇతని జీవితంలో ప్రేమించే అమ్మాయి తేను(అదితి శంకర్)వచ్చాక అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఆ తర్వాత విలన్లతో క్లాష్, ఫ్యామిలీ ఎమోషన్ గట్రా అంతా ఊహించినట్టే సాగుతుంది. ఇలాంటి కథలు కోకొల్లలుగా చూసిన ప్రేక్షకులకు ఇందులో కొత్తదనమంటూ ఏమీ లేదు.
ప్రభాస్ మున్నాలోని మెయిన్ పాయింట్ తీసుకుని దర్శకుడు ముత్తయ్య అక్కడ పల్లెటూరికి మార్చి ఫుల్ గా సెంటిమెంట్ ప్లస్ డ్రామా కోటింగ్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాలు ఎపిసోడ్లు ఫ్యాన్స్ కి మాస్ కి నచ్చేలా ఉన్నాయి కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొత్తదనం మచ్చుకు కూడా లేని విరుమన్ తెలుగులో రావడం అనుమానమే. గతంలో ఇదే దర్శకుడి కాంబోలో వచ్చిన కొంబన్ ని డిజాస్టర్ రిజల్ట్ వల్ల డబ్బింగ్ చేయకుండా వదిలేశారు.
This post was last modified on August 14, 2022 8:26 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…