నన్నే వాయిదా వేసుకోమంటున్నారు, థియేటర్లు దొరకడం లేదు, కెరీర్ లో మొదటిసారి ఏడవాల్సి వచ్చిందని కార్తికేయ 2 రిలీజ్ కు ముందు ఆవేదన చెందిన కుర్ర హీరో నిఖిల్ ఎట్టకేలకే హిట్ కొట్టేశాడు. పాజిటివ్ రివ్యూస్ తో పాటు పబ్లిక్ నుంచి టాక్ బాగుండటంతో బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు జిల్లా కేంద్రాలు పట్టణాల్లో ఈవెనింగ్ షోస్ నుంచే ట్రెండ్ కనిపిస్తోంది.
నిన్న మాచర్ల నియోజకవర్గం ఫలితం మరీ నిరాశాజనకంగా రావడం కార్తికేయ 2కి అన్నిరకాలుగా చాలా ప్లస్ అవ్వబోతోంది. మొత్తానికి నిఖిల్ కన్నీళ్లకు న్యాయం జరిగినట్టే. విజువల్ గ్రాండియర్లు అలవాటు పడిపోయి సాధారణ కంటెంట్ ని థియేటర్లో చూసేందుకు అంతగా ఇష్టపడని ట్రెండ్ లో ఆ అవకాశాన్ని కార్తికేయ 2 సరిగ్గా వాడుకుంది.
దర్శకుడు చందూ మొండేటి టేకింగ్, నీట్ గా ప్రెజెంట్ చేసిన గ్రాఫిక్స్,డ్యూయెట్లు లేకుండా, అవసరం లేని కామెడీ ఇరికించకుండా నడిపించిన కథనం వెరసి టికెట్ కొన్న ప్రేక్షకుడికి పైసా వసూల్ చేయించింది. అలా అని లోట్లేమీ లేవని కాదు కానీ డీసెంట్ అవుట్ ఫుట్ ఇచ్చినప్పుడు కంప్లయింట్ చేయడానికి ఏముంటుంది. ఇవాళ ప్రీమియర్లకు రాజమౌళి కుటుంబంతో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
కాలభైరవ సంగీతం ఆకర్షణ నిలవడంతో కీరవాణితో పాటు వీళ్లంతా వచ్చేశారు. అనుపమ పరమేశ్వరన్ జక్కన్న కాళ్లకు దండం పెట్టేసి ఆశీర్వాదం తీసుకుంది. మొత్తానికి పోస్టుపోన్ల పర్వం దాటుకుని విఘ్నాలను ఎందుకుంది ఫైనల్ గా సక్సెస్ మెట్టు ఎక్కేయడం ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. అర్జున్ సురవరం తర్వాత వచ్చిన ల్యాంగ్ గ్యాప్ ని పూడ్చేలా కార్తికేయ 2 హిట్టు కొట్టడంతో మూడో భాగం రావడం దాదాపు ఖాయమే.
This post was last modified on August 13, 2022 5:06 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…