అయిదు నెలల కిందట రాధేశ్యామ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో చివరగా ప్రభాస్ పబ్లిక్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అతనెక్కడా కనిపించలేదు. ఎట్టకేలకు తాను నటిస్తున్న ప్రాజెక్ట్-K చిత్రాన్ని నిర్మిస్తున్న వైజయంతీ మూవిస్ బేనర్లోనే తెరకెక్కిన సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బుధవారం ముఖ్య అతిథిగా వచ్చాడు యంగ్ రెబల్ స్టార్. బరువు తగ్గి, ఉబర్ కూల్ లుక్‌లోకి మారిన డెనిమ్ జీన్స్, టీ షర్ట్, క్యాప్, గాగుల్స్‌తో ట్రెండీగా తయారై వచ్చి అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
ఇక ప్రభాస్ ప్రసంగం కూడా ఆసక్తికరంగా సాగింది. తాను మైక్ అందుకోగానే.. వేదిక మీద నిర్మాత ప్రియాంక దత్ కనిపించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, యాంకర్ సుమను పిలిచి ప్రియాంక వస్తేనే మాట్లాడతా అని షరతు విధించాడు. దీంతో ప్రియాంక వచ్చి మైక్ తీసుకుని.. ప్రభాస్ గురించి మాట్లాడింది.
ప్రభాస్ మామూలుగా బయటికి రాడని, కానీ తమ కోసం, అలాగే సినిమాను బతికించడం కోసం ఈ ఈవెంట్‌కు వచ్చాడని ప్రియాంక పేర్కొంది. ఇక సినిమా గురించి నాలుగు ముక్కలు మాట్లాడాక ఆమె ప్రభాస్‌కు మైక్ ఇచ్చింది. సీతారామం టీంలో అందరి గురించి చాలా బాగా మాట్లాడాడు ప్రభాస్. దుల్కర్ సల్మాన్‌ను సూపర్ స్టార్‌గా అభివర్ణించడమే కాక.. అతను ఇండియాలోనే అత్యంత అందమైన నటుడని కితాబిచ్చాడు.
దర్శకుడు హను సినిమాలు కొన్ని తాను చూశానని.. నాగ్ అశ్విన్ చెప్పినట్లు అతను చాలా పొయెటిగ్గా సినిమాలు తీస్తాడని అన్నాడు. సీతారామం చాలా కష్టపడి చేసిన సినిమా అని.. విజువల్స్, మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి సినిమాను థియేటరుకే వెళ్లి చూడాలని ప్రభాస్ పిలుపునిచ్చాడు. ఇంట్లో పూజ గది ఉంది కదా అని గుడికి వెళ్లడం మానేస్తామా.. థియేటర్ అంటే తమకు గుడి లాంటిదే అని.. ప్రేక్షకులు థియేటరుకు వెళ్లి ఈ సినిమా చూడాలని ప్రభాస్ కోరాడు.
This post was last modified on August 4, 2022 9:24 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…