తన సినిమా ‘కార్తికేయ-2’ రిలీజ్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి యువ కథానాయకుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. జులై 22నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ముందు నిర్ణయించగా.. అదే రోజు రిలీజ్‌కు రెడీ అయిన ‘థాంక్యూ’ కోసమని దిల్ రాజు తన సినిమాను వాయిదా వేయించాడనే అర్థం వచ్చేట్లుగా అతను మాట్లాడాడు. తర్వాత ఆగస్టు 5కు ఫిక్సయితే.. ఆ డేట్ నుంచి కూడా తమ సినిమాను ఖాళీ చేయించినట్లు నిఖిల్ తెలిపాడు.
బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్లే తనకీ సమస్యలని.. ‘కార్తికేయ-2’కు అసలు ఇప్పుడిప్పుడే థియేటర్లు దొరకడం కష్టమని, అక్టోబరుకు వాయిదా వేసుకోమని కొందరు సూచించినట్లు కూడా నిఖిల్ వెల్లడించాడు. అయినా తమ నిర్మాతలు పట్టుబట్టి ఆగస్టు 12న ‘కార్తికేయ-2’ను రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారని, ఈ విషయంలో తగ్గేదే లేదని అతను స్పష్టం చేశాడు ఆ ఇంటర్వ్యూలో. తీరా చూస్తే ఇప్పుడు ఆగస్టు 12న కూడా సినిమా రావట్లేదు.
ఒక రోజు ఆలస్యంగా 13కు ఆ చిత్రం షెడ్యూల్ అయింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సెలవు కావడంతో శుక్రవారం అడ్వాంటేజ్ కోల్పోయినా.. రెండు రోజుల వీకెండ్, ఒక రోజు సెలవు ప్లస్ అవుతాయని సర్దిచెప్పి సినిమాను ఒక రోజు వాయిదా వేయించినట్లు కనిపిస్తోంది. ఆగస్టు 12న రాబోతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ ఓపెనింగ్స్‌పై ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేయించారన్నది స్పష్టం.
ఐతే వరుసగా మూడు వారాంతాలకు షెడ్యూల్ అయిన సినిమాల నిర్మాతలు.. నిఖిల్ సినిమా తమ చిత్రాలకు పోటీ కాకూడదని అంత ఒత్తిడి తెచ్చి డేట్లు మార్పించారంటే ‘కార్తికేయ-2’ను చూసి వాళ్లు భయపడుతున్నట్లే లెక్క. ‘కార్తికేయ’ అప్పట్లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది.
దాని సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇన్ సైడ్ రిపోర్ట్స్ కూడా పాజిటివ్‌గా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా వల్ల తమ చిత్రాలకు డెంట్ తప్పదని ఆయా సినిమాల నిర్మాతలు భయపడి దీన్ని వాయిదా వేయించారని అర్థమవుతోంది. ఇలా మళ్లీ మళ్లీ డేట్ మార్చుకోవాల్సి రావడం ఇబ్బందికరమే అయినా.. తమ సినిమాను చూసి అందరూ భయపడడాన్ని ఒక రకంగా పాజిటివ్ సంకేతంగానే చూడాలి చిత్ర బృందం.
This post was last modified on %s = human-readable time difference 4:22 pm
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు సమర్థించారు.…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…