నానిని దిల్ రాజు హర్ట్ చేయగలడా?

సినిమా థియేటర్లు తెరుచుకోడానికి ఇంకా చాలా సమయం ఉండడంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను డైరెక్ట్ గా ఓటిటీలో విడుదల చేయాలంటూ కంపెనీలు ఆఫర్లతో నిర్మాతలను ముంచెత్తుతున్నాయి. ఓటిటీ ప్లాటుఫారంకి నాని నటించిన ‘వి’ పెద్ద రేంజ్ సినిమా అయినా కానీ దాన్ని ముప్పై కోట్లు ఇచ్చి అయినా కొనేయడానికి ఓటిటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.

ఎవరో ఎందుకు… అల్లు అరవిందే ఆహా కోసం ముప్పై కోట్లు కోట్ చేశారట. దిల్ రాజుకి విడుదల చేయాలని ఉన్నా కానీ ఇంతకుముందు నాని అభ్యంతరం చెప్పడం వల్ల ఆగిపోయాడట. ఇప్పుడు మరింత ఆలస్యం కావడంతో దిల్ రాజుపై ప్రెజర్ పెరుగుతోంది. కానీ నాని మాత్రం డిజిటల్ రిలీజ్ కి సుముఖంగా లేడని తెలిసింది.

నిర్మాతదే అంతిమ నిర్ణయం అయినా కానీ హీరో మాట కాదంటే హర్ట్ అవుతాడు. దిల్ రాజుకి నానితో మంచి రిలేషన్ ఉంది. మరి ఒక్క సినిమా కోసం ఆ బంధాన్ని పణంగా పెడతాడా అనేది కాస్త అనుమానమే.