కుర్ర హీరో నిఖిల్ బాగా నర్వస్ అవుతున్నాడు. ఈ నెల 12న విడుదల కాబోతున్న కార్తికేయ 2 మీద మంచి వైబ్రేషన్స్ ఉన్నప్పటికీ విపరీతమైన పోటీ మధ్య దిగాల్సి రావడంతో ఆ మాత్రం టెన్షన్ ఉండటం సహజం. ముందు ప్లాన్ చేసుకున్న జూలై 22 డేట్ చేజారి పోవడం పట్ల ఇప్పటికీ టీమ్ బాధ పడుతూనే ఉంది. థాంక్ యు కోసం తప్పుకోవాల్సి రావడం, అది డిజాస్టర్ కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద స్పేస్ వృథాగా మారిపోవడం ఇవన్నీ కలవరపరిచేవే.
ఒకవేళ అప్పుడే వచ్చి ఉంటే కార్తికేయ 2కి పెద్ద అడ్వాంటేజ్ దక్కేది. రిలీజ్ విషయంలోనూ నిఖిల్ కు చాలా ఒత్తిళ్లు వచ్చాయి. థియేటర్లు దొరకవని, అక్టోబర్ లేదా నవంబర్ కో షిఫ్ట్ చేసుకోమని గట్టి ప్రెజర్ ఎదురయ్యింది. అసలే మంచి స్లాట్ మిస్ అయ్యిందని ఫీలవుతుంటే మధ్యలో ఈ తలనెప్పులు రావడంతో ఒకదశలో ఏడ్చినంత పనైంది.
అయినా తగ్గకుండా నిఖిల్ టీమ్ ముందడుగు వేయడం మంచిదే. కాకపోతే స్క్రీన్ల విషయంలో రాజీ పడక తప్పేలా లేదు. లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గానికి ఎలాగూ థియేటర్లు ఎక్కువ పడతాయి. కార్తీ విరుమన్ తెలుగులో వస్తే దానికీ ఇవ్వాల్సి వస్తుంది.
వారం ముందు వచ్చే బింబిసార, సీతారామంలు అప్పటికి రన్ లోనే ఉంటాయి కాబట్టి అంత తేలిగ్గా కౌంట్ తగ్గవు. ఈ నేపథ్యంలో కార్తికేయ 2కి టాక్ చాలా కీలకం. మంచి విజువల్స్, ఫాంటసీ కంటెంట్, పెద్ద క్యాస్టింగ్, కృష్ణుడి సెంటిమెంట్ లాంటి సానుకూల అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటికి పాజిటివ్ పబ్లిసిటీ వస్తే కనక కలెక్షన్ల పరంగా టెన్షన్ పడాల్సింది ఉండదు. కార్తికేయకు ఇప్పుడీ సెకండ్ పార్ట్ కు మధ్య పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. అందుకే నిఖిల్ పడుతున్న ఆవేదనలో న్యాయముంది. మంచి ఫలితం వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది
This post was last modified on August 1, 2022 6:31 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…