దర్శకుడిగా తొలి అవకాశం అందుకోవడం, విజయవంతంగా సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడం, ప్రేక్షకులను ఆ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించడం అంత తేలికైన విషయాలు కావు. ఇవన్నీ పూర్తి చేసి సినిమా మరి కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుండగా.. ఆ దర్శకుడు ఎంత ఎగ్జైట్మెంట్‌తో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇలాంటి సమయంలో సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్ ఏది జరిగినా అందరి దృష్టీ ఆ దర్శకుడి మీదే ఉంటుంది. ఆ ఈవెంట్లలో దర్శకుడి పాత్ర కీలకంగా ఉంటుంది. అందరూ అతడి గురించి మాట్లాడతారు. కానీ ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’తో దర్శకుడిగా పరిచయం అవుతున్న రాజశేఖర్ రెడ్డి పరిస్థితి దీనికి పూర్తి భిన్నం.
పూరి జగన్నాథ్ దగ్గర చాలా సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించి వేరే చిత్రాలకు కూడా పని చేసి.. ఆ అనుభవంతో ‘మాచర్ల నియోజకవర్గం’ స్క్రిప్టు రాసి నితిన్‌ను ఒప్పించి దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని మంచి కాస్ట్ అండ్ క్రూతో, బడ్జెట్‌తో చేసే అవకాశం దక్కించుకున్నాడతను.
ఈ సినిమా ప్రోమోలన్నీ కూడా మాస్‌లో బాగానే ఆసక్తి రేకెత్తించాయి. కానీ విడుదల ముంగిట ఓ అనుకోని వివాదం శేఖర్ మెడకు చుట్టుకుంది. అతను వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు వీరాభిమాని అయిన అతను.. కమ్మ, కాపు కులాలను దూషించినట్లుగా ఉన్న ఒక ట్వీట్ ఈ మధ్య వైరల్ అయింది. అది ఫేక్ ట్వీట్ అని వాదించినప్పటికీ.. గతంలో తన అకౌంట్ నుంచి కొన్ని అబ్యూజివ్ ట్వీట్లు ఉండడంతో కొన్ని వర్గాలు అతడికి వ్యతిరేకంగా మారాయి.
‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను బ్యాన్ చేయాలని, బాయ్ కాట్ చేయాలని ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రెండ్స్ జరిగే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ విషయంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఈ ప్రభావం సినిమా మీద గట్టిగా పడేలా ఉండడంతో నితిన్ అండ్ కో అలర్టయింది. గుంటూరులో శనివారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడిని పక్కన పెట్టేసింది. ప్రి రిలీజ్ ఈవెంట్ స్థాయిలో ఈ వేడుకను చేయగా.. శేఖర్ అందుబాటులో ఉన్నా కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనలేకపోయాడు.
ఉద్దేశపూర్వకంగానే అతణ్ని దూరం పెట్టారన్నది స్పష్టం. పైగా ఈ వేడుకలో నితిన్ సహా ఎవ్వరూ శేఖర్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. చివరికి డ్యాన్స్ మాస్టర్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించిన నితిన్.. దర్శకుడి పేరు ఎత్తకుండా తన ప్రసంగాన్ని ముగించడాన్ని బట్టి అతడి ఉద్దేశం అర్థమవుతోంది. దర్శకుడిని ఈవెంట్‌కు పక్కన పెట్టడమే అతడికి పెద్ద శిక్ష అంటే.. తన ప్రస్తావనే లేకుండా ఈ వేడుక ముగియడం తనను ఎంత బాధ పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. శేఖర్ పట్ల నితిన్ అండ్ కో మరీ అంత కఠినంగా వ్యవహరించాల్సింది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on July 31, 2022 3:49 pm
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…