ఈ మధ్య మన హీరోలు వేస్తున్న ప్రభుత్వాధికారుల పాత్రలు అచ్చిరావడం లేదు. అందులోనూ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన క్యారెక్టర్లు చేదు ఫలితాలనే ఇచ్చాయి. ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీలో డిప్యూటీ కలెక్టర్ కం ఎంఆర్ఓగా రవితేజ ఎన్ని సాహసాలు ఇన్వెస్టిగేషన్లు చేసినప్పటికీ కంటెంట్ వీక్ గా ఉండటం వల్ల జనం మెచ్చలేదు. గత ఏడాది డైరెక్ట్ ఓటిటిలో వచ్చిన టక్ జగదీష్ లో నాని విఆర్ఓగా నటించడం గుర్తుందిగా. అది థియేటర్లకు వచ్చి ఉంటే ఎలాంటి ఫలితాన్ని మూటగట్టుకునేదో ఈజీగా చెప్పొచ్చు.
ఇప్పుడు నితిన్ వంతు వచ్చింది. 12న విడుదల కాబోతున్న మాచర్ల నియోజకవర్గంలో తను కలెక్టర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఎన్నికలే లేకుండా యునానిమస్ గా గెలుస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్న విలన్ కు చెక్ పెట్టే పాత్రలో నితిన్ ని ఊర మాస్ గా చూపించబోతున్నాడు దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజకీయాలకు సంబంధించి తన పాత ట్వీట్ల వల్ల చిక్కుల్లో పడ్డ ఈ డెబ్యూ డైరెక్టర్ సినిమాలోనూ ఏవైనా పొలిటికల్ సెటైర్లు పెట్టాడానే ఆసక్తి ప్రేక్షకుల్లో లేకపోలేదు. అది బొమ్మ పడ్డాకే తెలుస్తుంది.
నిన్న వచ్చిన ట్రైలర్ ని ఎంటర్ టైన్మెంట్ ప్లస్ మాస్ యాక్షన్ ఉంటుందనేలా కట్ చేశారు. నితిన్ మాస్ యాంగిల్స్ ని ఎక్కువ రివీల్ చేశారు. ఈ మూడో ఆఫీసరైనా బాక్సాఫీస్ వద్ద గెలవడం చాలా అవసరం. అప్పుడెప్పుడో మోహన్ బాబు కలెక్టర్ గారు లాంటివి కమర్షియల్ గా బాగానే ఆడాయి. ఆ తర్వాత మా ఆవిడ కలెక్టర్, కలెక్టర్ గారి భార్యలాంటివి కొన్ని వచ్చాయి కానీ అవేవీ అంత ఇంపాక్ట్ చూపించలేదు. భీష్మ తర్వాత హిట్టు లేని నితిన్ కు ఈ మాచర్ల నియోజవర్గం మార్కెట్ పరంగా పెద్ద సక్సెస్ కావడం చాలా కీలకం
This post was last modified on July 31, 2022 11:25 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…