ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ రంగం ఒక రకమైన సంక్షోభంలో పడ్డట్లు కనిపిస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్నట్లే కోలుకుని.. మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు అందించలేక, రకరకాల కారణాల వల్ల థియేటర్లకు క్రమ క్రమంగా దూరం అవుతున్న ప్రేక్షకులను తిరిగి వెండితెరల వైపు మళ్లించలేక అన్ని ఇండస్ట్రీల వాళ్లూ ఇబ్బంది పడుతున్నారు. ఇండియా విషయానికి వస్తే.. మిగతా అన్ని ఇండస్ట్రీల కంటే బాలీవుడ్ చాలా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది.
కొవిడ్ బ్రేక్ తర్వాత కశ్మీర్ ఫైల్స్, భూల్ భూలయియా-2, జగ్ జగ్ జీయో.. ఈ మూడు చిత్రాలు మినహాయిస్తే ఏదీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్.. ఇలా పెద్ద పెద్ద స్టార్లు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని చవిచూశాయి. బాలీవుడ్ దుస్థితికి తాజా ఉదాహరణ.. షంషేరా. భారీ బడ్జెట్లో తెరకెక్కిన మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది.
ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో తెలియని అయోమయంలో పడిపోయింది బాలీవుడ్. గతంలో సౌత్ హిట్ సినిమాలను రీమేక్ చేసి ఈజీగా హిట్టు కొట్టేసేవారు బాలీవుడ్ ఫిలిం మేకర్స్. కానీ ఇప్పుడు రీమేక్ సినిమాలు అస్సలు వర్కవుట్ కావట్లేదు. జెర్సీ, హిట్ లాంటి మంచి సినిమాలు హిందీలో రీమేక్ అయి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి. ఇలాంటి టైంలో ఎప్పుడో 17 ఏళ్ల ముందు వచ్చిన తెలుగు చిత్రం ‘ఛత్రపతి’ని రీమేక్ చేస్తున్నారు. అది కూడా టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోందేమో.. తెలుగులో ఔట్ డేటెడ్ డైరెక్టర్‌గా ముద్ర పడిపోయిన వి.వి.వినాయక్.
శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ సినిమాలు కొన్ని యూట్యూబ్‌లో భారీ వ్యూస్ తెచ్చుకుని ఉండొచ్చు. అంతమాత్రాన అతను హిందీ సినిమా చేస్తే ఆదరిస్తారని గ్యారెంటీ లేదు. అందులోనూ ‘ఛత్రపతి’ లాంటి పాత సినిమాను, ఇప్పటిదాకా హిందీలో సినిమా చేసిన అనుభవమే లేని, ప్రస్తుతం బ్యాడ్ ఫాంలో ఉన్న వినాయక్ రీమేక్ చేయడం ఎంత వరకు కరెక్టో అర్థం కావడం లేదు. బాలీవుడ్ అసలే పేలవ దశను అనుభవిస్తున్న టైంలో ‘ఛత్రపతి రీమేక్‌తో చిత్ర బృందం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
This post was last modified on July 25, 2022 9:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…