మహానటితో మనముందుకొచ్చి కనులు కనులు దోచాయంటేతో బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ సోలో హీరోగా నటించిన మొదటి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ సీతా రామం. ఆగస్ట్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలేం లేవు కానీ వైజయంతి బ్యానర్. ఫీల్ గుడ్ మూవీస్ తీస్తాడనే పేరున్న హను రాఘవపూడి దర్శకుడు కావడం యూత్ పరంగా ఆకట్టుకునే అంశాలుగా కనిపిస్తున్నాయి. హైప్ ని పెంచే క్రమంలో అందరి దృష్టి ట్రైలర్ మీద ఉంది. ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ వేదికగా దీని లాంచ్ ఈవెంట్ జరిగింది.
ఎప్పుడో దశాబ్దాల క్రితం దొరికిన ఒక ప్రేమలేఖను మహాలక్ష్మి(మృణాల్ ఠాగూర్)కి చేరవేసే బాధ్యతను తీసుకుంటుంది అఫ్రీన్(రష్మిక మందన్న). తనకు కావాల్సిన మనిషికి ఇచ్చిన మాట కోసం. అది రాసిన రామ్(దుల్కర్ సల్మాన్)జాడ తెలియదు. ఉన్నాడో లేదో వివరాలు లేవు. అనాథ అయిన రామ్ కు అజ్ఞాతంలో ఉంటూ ఉత్తరాలు రాసే సీత నిజ జీవితంలో ఎలా కలుసుకుంది, ఇద్దరూ ఎందుకు విడిపోయారు, చివరి లెటర్ ఎందుకు చిరునామాకు అందకుండా ఆగిపోయింది లాంటి ప్రశ్నలకు సమాధానంగా సీతారామంని చూపించబోతున్నారు.
విజువల్స్ చాలా బాగున్నాయి. అప్పటి వాతావరణాన్ని పునఃసృష్టించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. క్యాస్టింగ్ కూడా గ్రాండ్ గా సెట్ చేసుకున్నారు.సుమంత్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, గౌతమ్ మీనన్ ఇలా లిస్టు పెద్దదే ఉంది. ప్రతి ఫ్రేమ్ లో హను రాఘవపూడి పొయెటిక్ సెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అసలే బాక్సాఫీస్ వద్ద అనిశ్చితి రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఇంత సున్నితమైన లవ్ స్టోరీని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. పైగా కళ్యాణ్ రామ్ బింబిసారతో పోటీ కూడా ఉంది
This post was last modified on July 25, 2022 4:08 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…