ఓటిటీ గేమ్ లో పెద్ద పెద్ద ప్లేయర్లతో ధీటుగా నిలబడాలంటే పెద్ద సినిమాల హక్కులు సొంతం చేసుకోవాలని అల్లు అరవింద్ గ్రహించారు. ఈ విషయంలో ముందే మేల్కొనక పోవడం వల్ల అల వైకుంఠపురములో హక్కులు వదిలేసుకున్నారు. లాక్ డౌన్ లో భవిష్యత్తు డిజిటల్ ప్లాటుఫామ్స్ దేనని అల్లు గ్రహించారు. అందుకే క్రేజీ సినిమాల హక్కులు సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ముందుగా ఈ టైంలో ఏదైనా పెద్ద సినిమాను ఆహా ద్వారా విడుదల చేస్తే సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతారని, విడుదలకు సిద్ధంగా ఉన్న నాని సినిమా ‘వి’ హక్కులు దక్కించుకుంటే ఈ గేమ్ లో చాలా ముందుకు వెళ్లవచ్చునని భావిస్తున్నారు. డిజిటల్ రిలీజ్ కి దిల్ రాజు సుముఖంగా లేకపోయినా కానీ అల్లు అరవింద్, బన్నీ వాస్ తరచుగా దిల్ రాజుని కాంటాక్ట్ చేస్తూ టెంప్టింగ్ ఆఫర్స్ ఇస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మూడు నెలలు ఆలస్యమయిన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలంటే కనీసం మరో మూడు నెలలు ఆగక తప్పదు. అంతవరకు రాజు ఓపిక పడతాడా లేక ఒత్తిడికి తలొగ్గి ఓటిటీ దారి పడతాడా అనేది చూడాలి.