ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోల్లో నాగ చైతన్య ఒకడు. అక్కినేని కుటుంబం నుండి దిల్ రాజు బేనర్ లో ‘జోష్’ సినిమాతో చైతూ హీరోగా లాంచయిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ళ క్రితం జోష్ కథతో నాగార్జునని దిల్ రాజు అప్రోచ్ అవ్వడమే ఆలస్యం రాజు మీద ఉన్న నమ్మకంతో చైతు మొదటి సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ కి అప్పగించాడు. నిజానికి నాగార్జున తన సొంత బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతుని లాంచ్ చేసి ఉండొచ్చు. కానీ అప్పట్లో దిల్ రాజు సక్సెస్ రేట్ చూసి నాగ్ ఆ డిసిషన్ తీసుకున్నాడు.
వాసు వర్మ దర్శకుడిగా పరిచయమైన జోష్ దర్శకుడిగా అతనికి హీరోగా చైతు కి సక్సెస్ అందించలేకపోయింది. కంటెంట్ ఫరవాలేదనిపించుకున్నప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల కాస్టింగ్ కుదరకపోవడం వల్ల పెద్దగా ఆడలేదు. అప్పటి నుండి చైతూతో దిల్ రాజు సినిమా చేయలేదు. ఈ కాంబోలో దాదాపు పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు ‘థాంక్యూ’ అనే సినిమా వస్తుంది.
దీంతో ఈసారి చైతు కి ఉన్న బాకీ ఉన్న హిట్ ఇచ్చి తనని నమ్మి అప్పట్లో అవకాశం ఇచ్చినందుకు అక్కినేని కుటుంబానికి ముఖ్యంగా నాగార్జునకి ఇప్పుడు థాంక్యూ చెప్పాలని చూస్తున్నాడు దిల్ రాజు. మరి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో చైతు కి కూడా హిట్ పడితే దిల్ రాజుకి నాగ్ కూడా థాంక్యూ చెప్తాడు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇక దిల్ రాజుని తన కొడుక్కి హిట్ ఇవ్వలేని నిర్మాతగా కాస్త దూరం పెట్టడం ఖాయం.
This post was last modified on July 19, 2022 4:48 pm
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…