ఒకప్పటి దేవీ మేజిక్ ఎక్కడ

ఒకప్పుడు కేవలం తన పాటలతోనే ఆడియో కంపెనీల క్యాసెట్ సేల్స్ ని కోట్లలోకి తీసుకెళ్లిన దేవిశ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా తన మేజిక్ టచ్ ని పూర్తిగా కోల్పోవడం అభిమానులను కలవరపెడుతోంది. అసలే టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత విపరీతంగా ఉంది. అందరూ తమన్ ని తీసుకోలేరు. పోనీ అనూప్ రూబెన్స్ లాంటి వాళ్ళతో సర్దుకుందామంటే ఎప్పుడు ఏ ఆల్బమ్ హిట్టయ్యేలా కొడతారో ముందే చెప్పలేని పరిస్థితి. అందుకే ఇప్పటికీ స్టార్ డైరెక్టర్లు రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా డిఎస్పికే ఓటు వేస్తుంటారు.

ఇటీవలే వచ్చిన ది వారియర్ లో దేవి స్కోర్ మీద ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయో రివ్యూలలోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా కనిపించాయి. ఎఫ్3 కామెడీ వల్ల హిట్టయ్యిందే తప్ప డిఎస్పి చేసిందేమీ లేదు. ఆడవాళ్ళూ మీకు జోహార్లు పాటలు ఆల్రెడీ జనం మర్చిపోయారు. ఖిలాడీ డిజాస్టర్ అయ్యిందన్న సంగతి పక్కనపెడితే కనీసం అందులో పాటలు మెప్పించినా మాస్ రాజా ఫ్యాన్స్ ఊరట చెందేవాళ్ళు. గుడ్ లక్ సఖి బ్యాడ్ ఆల్బమ్ గా మిగలగా రౌడీ బాయ్స్ ట్యూన్స్ సైతం యూత్ లో సోసోగా వెళ్లాయి.

దేవిశ్రీ ప్రసాద్ చివరి బెస్ట్ ఆల్బమ్ ఏదంటే పుష్ప ది రైజ్ ఒకటే. అంతకు ముందు ఉప్పెన అంతే. ఈ రెండూ సుకుమార్ తో ముడిపడిన ప్రాజెక్టులు. అవి మినహాయిస్తే రంగ్ దే, అల్లుడు అదుర్స్ లది కూడా అదే కహాని. మొత్తానికి దేవి తన కంపోజింగ్ గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు తన చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులు రెండు. చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బన్నీ పుష్ప 2 ది రూల్. వీటితో కనక సాలిడ్ కంబ్యాక్ ఇస్తే మళ్ళీ వేగమందుకోవచ్చు. అసలు వర్షం, జల్సా, భద్ర, ఆర్య నాటి దేవి ఏమయ్యాడో. రావాలనే ప్రతి మ్యూజిక్ లవర్ కోరిక.