శివ రూపంలో టాలీవుడ్ దర్శకుల ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడెలాంటి సినిమాలు తీస్తున్నారో గమనిస్తున్నాంగా. అయినా అభిమానుల్లో ఎక్కడో మిణుకుమిణుకు మంటూ చిన్న ఆశ. తమ పాత వర్మ తిరిగి రాకపోతాడా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. మధ్యలో రక్త చరిత్ర లాంటివి ఫర్లేదనిపించాయి కానీ ఆయన మార్కు క్లాసిక్ వచ్చి ఎన్నేళ్లయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. ఇటీవలే భారీ హంగామా మధ్య పబ్లిసిటీ చేసుకుని వచ్చిన కొండా వీకెండ్ గడిచే లోపే కంప్లీట్ గా ప్యాకప్ అయిపోయింది.
ఇవాళ అమ్మాయితో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు వర్మ. హిందీలో లడ్కీ టైటిల్ తో ప్రమోట్ చేశారు. చైనాలో 40 వేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నామని పబ్లిసిటీ ఓ రేంజ్ లో ఇచ్చారు. నిన్న ది వారియర్ టాక్ సోసోగా ఉండటంతో అదేమైనా ప్లస్ అవుతుందేమేననే అంచనాలు లేకపోలేదు. కానీ వర్మ ఈసారి కూడా తాను ఎప్పుడో పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి రాబట్టుకునే ఉద్దేశంలో లేనని స్పష్టం చేశారు. బ్రూస్ లీ స్ఫూర్తితో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఓ అమ్మాయి కథను తెరమీద చూపించే క్రమంలో వర్మ నానా పాట్లు పడ్డారు.
పాత చింతకాయ పచ్చడి టేకింగ్, నటీనటుల అత్తెసరు పెర్ఫార్మన్స్ తో అమ్మాయిని రుచి లేని కిచిడీలా అందించారు. విచ్చలవిడిగా అందాల ఆరబోతే చేయిస్తూ ఫైట్లు పెడితే మాస్ వెర్రెక్కిపోతారని అనుకున్నారు కాబోలు వాటిని మరీ హద్దులు దాటించేయడంతో అది కాస్తా వెగటు వ్యవహారంగా మారిపోయింది. టైటిల్ రోల్ పోషించిన పూజా భలేకర్ గురించి తక్కువ చెప్పుకోవడం ఉత్తమం. నేనేం చూడమని బలవంతం చేయను కదాని పదే పదే సినిమాలు తీస్తున్న వర్మ నుంచి ఇంతకన్నా కంటెంట్ ఏం ఆశించగలం
This post was last modified on July 15, 2022 2:59 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…