Movie News

కంగనా.. తిన్న దెబ్బ సరిపోలేదా?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే కంగనా రనౌత్‌ తరహా ఇమేజ్, మార్కెట్ తెచ్చుకున్న కథానాయికలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఆమె పేరు మీద ఒక సినిమాకు వంద కోట్ల బిజినెస్ జరిగే రేంజ్ రావడం అంటే మాటలు కాదు. క్వీన్, తను వెడ్స్ మను రిట్నర్స్, మణికర్ణిక లాంటి సినిమాలతో కొన్నేళ్ల ముందు వరకు ఆమె ఊపు మామూలుగా లేదు. కానీ ఈ ఇమేజ్‌, ఫాలోయింగ్‌ను ఆమె చేజేతులా దెబ్బ తీసుకుంది.

అందుకు కేవలం ఆమె తర్వాత చేసిన ఫ్లాప్ సినిమాలు మాత్రమే కారణం కాదు. అదే పనిగా బాలీవుడ్ ప్రముఖులందరినీ టార్గెట్ చేసి నోరు పారేసుకోవడం, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి భజన చేయడం జనాలకు నచ్చలేదు. ఏదైనా ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది కానీ.. శ్రుతి మించితేనే కష్టం. కొంచెం న్యూట్రల్‌గా కనిపిస్తూ ఒక పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేయడం వేరు. అలా కాకుండా అదే పనిగా భజన చేయడం, అవతలి పార్టీలను టార్గెట్ చేయడంతో జనాలకు చిర్రెత్తుకొచ్చింది.

కంగనా గత రెండేళ్లలో చేసిన అతికి ఆమె మీద జనాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందో ఇటీవల ‘ధకడ్’ సినిమా రిలీజైనపుడు అందరూ చూశారు. అది మరీ అంత పెద్ద డిజాస్టర్ అవ్వాల్సిన సినిమా అయితే కాదు. ఒకప్పుడు వంద కోట్ల వసూళ్లు వచ్చాయి కంగనా సినిమాలకు. కానీ ఈ చిత్రానికి ఫుల్ రన్లో ఐదు కోట్లు కూడా వసూలు కాలేదు. ఇదంతా కంగనా కోరి తెచ్చుకున్న నెగెటివిటీ పుణ్యమే. ఉన్న నెగెటివిటీ చాలదన్నట్లు ఇప్పుడామె ఎమర్జెన్సీ నేపథ్యంలో సినిమా చేయబోతోంది. ఇందులో కంగనా ఇందిరా గాంధీ పాత్ర చేయబోతుండటం గమనార్హం. అందుకోసం ఆమె కష్టపడి మేకోవర్ చేసుకుంది. ఈ చిత్రానికి కథ కూడా కంగనా రనౌతే అందించడం విశేషం. ఇది అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

పెద్ద హిస్టారియన్ లాగా ఆమె ఎమర్జెన్సీ మీద సినిమాకు కథ అందించడమేంటి అంటూ అప్పుడే కౌంటర్లు మొదలైపోయాయి. ఇది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని, ఇందిరను డీగ్రేడ్ చేసేలా ఉండే సినిమా అయి ఉంటుందని.. కొన్నేళ్లుగా మోడీ సర్కారు భజన చేస్తున్న కంగనా ఈ సినిమా చేస్తోంది కాబట్టి దీని విశ్వసనీయత మీద జనాలకు సందేహాలు నెలకొనడం ఖాయమని, ఇందులో నిజాలు చూపించినా కూడా దీన్నొక ప్రాపగండా ఫిలిం లాగే జనాలు చూడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.‘ధకడ్’తో తిన్న దెబ్బ సరిపోలేదని.. మరో షాక్‌కు కంగనా రెడీ అవుతోందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

This post was last modified on July 15, 2022 9:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

31 mins ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

3 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

4 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

5 hours ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

6 hours ago