Movie News

స్టార్ జంట ఇల్లు 119 కోట్లు

బాలీవుడ్ స్టార్ల వైభోగం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. రణ్వీర్ సింగ్ – దీపికా పదుకునేల జంట తాజాగా కొన్న ఫ్లాట్ ఖరీదు అక్షరాల 119 కోట్లట. ఇప్పుడీ టాపిక్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది.

ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న బాంద్రాలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు నివసించే విల్లాల మధ్య రణ్వీర్ తన కొత్త ఫ్లాట్ ని కొనేసుకున్నాడు. వీళ్ళుండబోయే అపార్ట్మెంట్ పేరు సాగర్ రేశం. సింగల్ ఫ్లాట్ కి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారని బిజినెస్ వర్గాల టాక్.

ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. పేరుకి అపార్ట్ మెంటే అయినప్పటికీ రణ్వీర్ దీపికలు ఉండబోయే ఫ్లాట్ మొత్తం నాలుగు ఫ్లోర్లలో విస్తరించి ఉంటుంది. 16 నుంచి 19 దాకా అనుసంధానం చేసి డబుల్ డ్యూప్లెక్స్ తరహాలో దీన్ని నిర్మించారు. సింపుల్ గా చెప్పాలంటే క్వాడ్రప్లెక్స్ అంటారు. 11 వేల 266 చదరపు అడుగులతో పాటు ప్రత్యేకంగా 1300 చ.అ టెర్రస్ కూడా ఉంటుంది. ఇందులో ఒక్క చ.అడుగు సుమారు 1 లక్షపైనే ఉంటుందట. స్టాంప్ డ్యూటీ కోసమే 7 కోట్ల 13 లక్షలు కట్టాల్సి రావడం దీని ప్రత్యేకత.

ఎప్పుడూ ట్రెండీగా ఆలోచించే రణ్వీర్ సింగ్ కు ఇదేమంత పెద్ద మొత్తం కాకపోవచ్చేమో కానీ వింటున్న వాళ్ళ గుండెలు మాత్రం అదురుతున్నాయి. మరి పార్కింగ్ స్లాట్ ఎలానే అనుమానం వస్తోందా. వీళ్ళు కొన్న ఫ్లాట్ కు గాను మొత్తం 19 కార్లు వాహనాలు నిలబెట్టుకునేందుకు చోటిచ్చారు.

రణ్వీర్ సింగ్ సర్కస్, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానితో బిజీగా ఉండగా దీపికా మన ప్రభాస్ తో నటించబోయే ప్రాజెక్ట్ కెతో మొదటిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అయినా వందల కోట్ల పారితోషికాలు తీసుకునే స్టార్ కపుల్ కి ఈ మాత్రం గ్రాండియర్ ఫ్లాట్ ఉండాల్సిందేనని అభిమానులు మురిసిపోతున్నారు.

This post was last modified on July 11, 2022 2:29 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

7 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

9 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

9 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

9 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

13 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

13 hours ago