Movie News

కొంచెం ఆనందం కొంచెం ఆందోళన

నిన్న విడుదలైన మణిరత్నం విజువల్ గ్రాండియర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ట్రైలర్ ఆన్లైన్లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. తమిళ తంబిల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ తాము ఊహించలేదని ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ మల్టీ స్టారర్ కాంబినేషన్ ఓ రేంజ్ లో ఉండటంతో అంచనాలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. తెలుగులోనూ అదే టైటిల్ ని పెట్టేసి పిఎస్ 1 గా నామకరణం చేసేశారు. సో దాంతోనే సర్దుకోవాలి.

ఇదంతా బాగానే ఉంది కానీ మరోపక్క కొంత ఆందోళన కూడా రేగుతోంది. పొన్నియన్ సెల్వన్ చరిత్రను ఆధారంగా చేసుకుని రాయబడ్డ సుప్రసిద్ధ నవల. దానికి తెరరూపం అంటే పెద్ద సవాల్. ఏ మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా హిస్టరీ ప్రేమికులు విరుచుకుపడతారు. చోళ వంశస్థుల నుంచి అభ్యంతరాలు రావొచ్చు. ఇదంతా ఒక ఎత్తయితే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దీన్నెలా డీల్ చేసుంటారన్న అనుమానం లేకపోలేదు. ఆయన స్థాయి బ్లాక్ బస్టర్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో చెప్పడం కష్టం.

వీటికి తోడు బాహుబలిని మించి తమకూ ఒక గొప్ప చిత్రం నిలిచిపోవాలని కలలు కంటున్న కోలీవుడ్ మేకర్స్ కు ఇది ఏ మాత్రం ఆ స్థాయికి తగ్గినా అవమానంగా ఫీలవుతారు. పైగా ఇది మొదటి భాగమే కాబట్టి ఏ మాత్రం ఫలితం కొంచెం అటు ఇటు వచ్చినా దాని ప్రభావం నేరుగా పార్ట్ 2 బిజినెస్ మీద పడుతుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా మేజిక్ చేసి దశాబ్దం పైనే అవుతోంది. హంగామా ఎంత ఉన్నా ఎమోషన్ తో కూడిన ఎలివేషన్లు ఇలాంటి సినిమాల్లో చాలా కీలకం. మరి మణి జక్కన్న స్థాయిలో మాయాజాలం చేయగలడో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 30 దాకా ఆగాల్సిందే.

This post was last modified on July 9, 2022 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

9 minutes ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

9 minutes ago

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

3 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

4 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

4 hours ago