ఆచార్య చేదు జ్ఞాపకాల నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామాని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ చూపు ఇప్పుడు గాడ్ ఫాదర్ మీదే ఉంది. నిన్నటి నుంచి తెగ ఊరిస్తూ వచ్చిన ఫస్ట్ లుక్ ని ఇందాకా రిలీజ్ చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో పోస్టర్ కొంచెం నిరాశ పరిచినా వీడియో టీజర్ మాత్రం అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా ఉంది. స్టైలిష్ కారులో వచ్చి సునీల్ డోర్ తీశాక మెగాస్టార్ కిందకు దిగి అలా నడుచుకుంటూ వచ్చే షాట్ ని ఇందులో రివీల్ చేశారు. ఎక్స్ పెక్ట్ చేసినట్టే తమన్ తన టెర్రిఫిక్ బిజిఎంతో చించేశాడు.
కాకపోతే ఒరిజినల్ వెర్షన్ లో ఇదే సీన్ పిక్చరైజేషన్ ఇంకోలా ఉంటుంది. హడావిడి లేకుండా మోహన్ లాల్ పోలీసులను దాటుకుని వచ్చే ఎపిసోడ్ ని హై ఇంటెన్సిటీతో షూట్ చేశారు. ఇందులోనూ ఆ డెప్త్ ఉంది కానీ చిరంజీవి ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు మోహన్ రాజా కాస్త కమర్షియల్ టచ్ ఎక్కువగా ఇచ్చారు. మొత్తానికి మ్యాటర్ ఉందనిపించేలా కట్ చేశారు కానీ ఇంకేదో కావలసిందనే ఫీలింగ్ ఫ్యాన్స్ మనసులో ఉండేలా చేశారు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడే అన్ని ఓపెన్ చేస్తే ఎలా అనే కామెంట్లు లేకపోలేదు.
గాడ్ ఫాదర్ రిలీజ్ ని విజయదశమిని లాక్ చేసేశారు. తెలివిగా డేట్ చెప్పలేదు. ఏజెంట్ కూడా అదే సీజన్ టార్గెట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక అండర్ స్టాండింగ్ కుదిరాక విడుదల తేదీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రావొచ్చు. గాడ్ ఫాదర్ కు కలిసి రాబోయే అంశం మరొకటి ఉంది. రాబోయే ఆరేడు నెలల్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలేవీ విడుదల కావడం లేదు. సో ఆ ఇద్దరి ఫ్యాన్స్ సపోర్ట్ కూడా పూర్తిగా ఈ మెగా మూవీకే దక్కుతుంది. మరి గాడ్ ఫాదర్ ఆచార్య గాయాన్ని మాన్పుతాడా. చూద్దాం.
This post was last modified on July 4, 2022 6:12 pm
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…
రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార విడుదల చేసిన…
ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను…
దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు తట్టకపోవచ్చు కానీ.. తన చేతిలో ఉన్నప్రాజెక్టుల లిస్టు చూస్తే…
వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…