తమిళంలో చిన్న చిన్న హీరోలు కూడా తెలుగులో మంచి గుర్తింపు, మార్కెట్ సంపాదించుకున్న టైంలో అక్కడ టాప్ స్టార్లలో ఒకడైన విజయ్‌కి మాత్రం ఇక్కడ ఏమాత్రం పాపులారిటీ ఉండేది కాదు. గతంలో కొన్ని అనువాద చిత్రాల ద్వారా విజయ్ ఇక్కడ పాగా వేద్దామని చూశాడు కానీ.. పెద్దగా ఫలితం లేకపోయింది. ఐతే చాలా ఏళ్ల ప్రయత్నాల తర్వాత తుపాకి సినిమా అనుకోకుండా హిట్టవడం.. ఆ తర్వాత జిల్లా, అదిరింది, విజిల్, మాస్టర్ సినిమాలు కూడా మంచి ఫలితం అందుకోవడంతో కొంత మార్కెట్ క్రియేటైంది విజయ్‌కి.
ఇలాంటి టైంలో విజయ్ ఇక్కడికి వచ్చి తన సినిమాలను ప్రమోట్ చేస్తే.. తెలుగు ప్రేక్షకుల మీద అభిమానం చూపిస్తే బాగుండేదేమో. కానీ అతను అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. ఇటీవల బీస్ట్ సినిమాకు మంచి బజ్ వచ్చినా.. విజయ్ మాత్రం తెలుగులో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయలేదు. వంశీ పైడిపల్లి సినిమాతో తెలుగులోకి అడుగు పెడుతున్న అతను.. ఈ మాత్రం కూడా సమయం కేటాయించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఐతే విజయ్ సైలెంటుగా ఉన్నప్పటికీ.. అతడికి తెలుగులో ఫాలోయింగ్ పెంచడానికి నిర్మాత దిల్ రాజు ప్రయత్నం చేస్తుండటం విశేషం. వంశీ-విజయ్ సినిమాను నిర్మిస్తున్నది ఆయనే అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేయడమే కాదు.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విజయ్ అభిమానుల కోసం తుపాకి సినిమా స్పెషల్ షోను ప్లాన్ చేశాడు రాజు. అక్కడి ఫేమస్ థియేటర్ సుదర్శన్ 35 ఎంఎంలో సెకండ్ షోగా తుపాకిని ప్రదర్శించబోతున్నారు.
మామూలుగా మన దగ్గర టాప్ స్టార్లకు మాత్రమే ఇలా బర్త్ డేల టైంలో స్పెషల్ షోలు వేస్తుంటారు. వాటికి మంచి స్పందన కూడా ఉంటుంది. కానీ విజయ్‌కి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగే అంతంతమాత్రం. అలాంటి హీరో పుట్టిన రోజుకు పదేళ్ల కిందటి సినిమాను స్పెషల్ షోగా వేయడం కొంచెం అతిగానే అనిపిస్తోంది. విజయ్ అంటే పడిచచ్చిపోయి ఇలా స్పెషల్ షోకు వెళ్లే జనాలు ఎంతమంది ఉంటారన్నది ప్రశ్న.
This post was last modified on June 21, 2022 10:16 am
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…