ఒక సౌత్ ఇండియన్ వెబ్ సిరీస్ కి అమెజాన్ ప్రైమ్ భారీ పబ్లిసిటీ చేయడం సుడల్ విషయంలోనే జరిగింది. రెండు మూడు వారాలుగా దీని గురించి సోషల్ మీడియాలోనూ హల్చల్ జరుగుతోంది. తెలుగు ఆర్టిస్టులు లేకపోయినా ఐశ్వర్య రాజేష్, పార్తీబన్ లాంటి కొందరు తెలిసున్న క్యాస్టింగ్ ఉండటంతో పాటు ట్రైలర్ ని ఆసక్తికరంగా కట్ చేయడం వల్ల ఓటిటి ఆడియన్స్ కి దీని మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ విక్రమ్ వేదా దర్శకులు పుష్కర్ గాయత్రిలు రచన చేసి పర్యవేక్షించిన సిరీస్ కావడంతో ఆసక్తి పెరిగింది.
ఇది తమిళనాడు ఓ హిల్ స్టేషన్ ఉండే చిన్న పట్టణంలో జరిగే కథ. 30 ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీ రాత్రికి రాత్రి తగలబడి పోతుంది. సరిగ్గా అదే సమయంలో కార్మిక నాయకుడు షణ్ముగం(పార్తీబన్)చిన్న కూతురు నీల మాయమవుతుంది. తండ్రికి కుటుంబానికి దూరంగా కోయంబత్తూర్ లో ఉండే నీల అక్క(ఐశ్వర్య రాజేష్)చెల్లెలి కోసం తిరిగి వస్తుంది. స్థానిక ఇన్స్ పెక్టర్(కథిర్)సహాయంతో వేట మొదలుపెడుతుంది. ఈ కిడ్నాప్ కి పోలీస్ అధికారి(శ్రేయా రెడ్డి)కొడుకు కనిపించకుండా పోవడానికి లింక్ ఉంటుంది. దానికి తోడు అక్కడ ఘనంగా జరిగే అమ్మవారి జాతరలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఆపై నడిచేదే అసలు స్టోరీ.
ఎనిమిది ఎపిసోడ్లు అన్నీ కలిపి సుమారు ఆరున్నర గంటల నిడివి ఉన్న సుడల్ ఈ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులకు ఓ మోస్తరుగా నచ్చుతుంది. వెబ్ సిరీస్ కాబట్టి ల్యాగ్ ఉన్నప్పటికీ బలమైన క్యాస్టింగ్, కీలకమైన మలుపులను హ్యాండిల్ చేసిన విధానం మరీ విసుగు రాకుండా చేసింది. కాకపోతే సబ్జెక్టులో కొత్తదనం లేకపోయినా టేకింగ్, లొకేషన్లు ఫ్రెష్ గా అనిపిస్తాయి. విశాల్ పొగరులో విలన్ గా కనిపించిన శ్రేయా రెడ్డి ఇంత గ్యాప్ తర్వాత కూడా అదరగొట్టేశారు. పార్తీబన్, కథిర్ ల పెర్ఫార్మన్స్ దన్నుగా నిలిచింది. ఐశ్వర్యరాజేష్ కు పెద్దగా స్కోప్ దక్కలేదు. అసలు ట్విస్ట్ అంతగా కిక్ ఇవ్వలేకపోయింది. బ్రహ్మ-అనుచరణ్ ల జంట దర్శకత్వం పర్లేదు.
This post was last modified on June 18, 2022 12:15 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…