Movie News

ఆర్ఆర్ఆర్.. మరో సంచలనం

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా మూడు నెలల కిందట విడుదల కావడం.. అంచనాలకు తగ్గట్లే భారీ విజయాన్నందుకోవడం తెలిసిందే. ఆ సినిమా థియేట్రికల్ రన్ ఆల్రెడీ ముగిసింది. కానీ నెట్ ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ డిజిటల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.
‘బాహుబలి’తో పోలిస్తే తక్కువ అనిపించిన మన వాళ్లకు తక్కువగా అనిపించిన ‘ఆర్ఆర్ఆర్’కు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు, నేటివ్ అమెరికన్స్ ఈ సినిమా చూసి వెర్రెత్తిపోతున్నారు. నెట్ ఫ్లిక్స్ల్ ఈ సినిమా చూసి కోట్లాది మంది ఎగ్జైట్ అయిపోతున్నారు. అందులోనూ ఇటీవల యుఎస్‌లో encoRRReపేరుతో మళ్లీ ఈ సినిమాను రిలీజ్ చేయగా.. రెస్పాన్స్ మామూలుగా లేదు. ఫేమ‌స్ హ‌లీవుడ్ సూప‌ర్ హీరోల సినిమాలు చూస్తున్న‌పుడు ఉండే యుఫోరియా థియేట‌ర్ల‌లో క‌నిపిస్తోంది.

ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ యుఎస్‌లో అరుదైన ఘనత సాధించింది. అక్కడ ప్రధాన మీడియా సంస్థల్లో ఒకటైన ‘యుఎస్ఏ టుడే’.. ‘ఆర్ఆర్ఆర్’కు గొప్ప గౌరవాన్నే కట్టబెట్టింది. 2022 టాప్-10 సినిమాల జాబితాను ప్రకటించిన యుఎస్ఏ‌ టుడే.. ‘ఆర్ఆర్ఆర్’కు అగ్రస్థానాన్ని కట్టబెట్టడం విశేషం.

బ్యాట్ మ్యాన్, టాప్ గన్ మావ్రిక్, ఫాలౌట్ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలను మన సినిమా వెనక్కి నెట్టేసింది. ముందు హాలీవుడ్ వైపు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ మీద ప్రశంసలు కురుస్తుంటే.. ఇదేదో పెయిడ్ ప్రాపగండా అనుకున్నారు. కానీ అక్కడి వారికి ‘ఆర్ఆర్ఆర్’ నిజంగానే తెగ నచ్చేసిందని.. పెద్ద ఎత్తున ప్రముఖులు ఎగ్జైట్మెంట్‌తో స్పందిస్తుంటే అర్థమైంది.

‘పుష్ప’ సినిమా హిందీ జనాలకు అనుకోకుండా విపరీతంగా నచ్చేసినట్లే ‘ఆర్ఆర్ఆర్’ సైతం యుఎస్ నేటివ్ అమెరికన్స్‌ను మెప్పించి వారిని వెర్రెత్తిపోయేలా చేసిందన్నది స్పష్టం. ప్రేక్షకులకు నచ్చడం ఒకెత్తయితే ప్రముఖ మీడియా సంస్థ.. దీనికి టాప్ ర్యాంక్ ఇవ్వడం మరో ఎత్తు.

This post was last modified on June 17, 2022 2:15 pm

Share

Recent Posts

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

26 minutes ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

1 hour ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

2 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

2 hours ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

2 hours ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

2 hours ago