అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టి అక్కడ భారీ విజయం అందించారు. ఇప్పటికే బాలీవుడ్ నుండి పుష్ప కి చాలా ప్రశంసలు దక్కాయి. చాలా మంది సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా పుష్ప మేనరిజంతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు. అయితే తాజాగా ఈ సినిమాకు మరో ప్రశంస దక్కింది.
అయితే ఈసారి పుష్పకి వచ్చిన ప్రశంస ఆషామాషీ వ్యక్తి నుండి కాదు. షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సైతం ఆయనతో సినిమా చేయడం కోసం ఇరవై ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్న బాలీవుడ్ బడా దర్శకుడు రాజ్ కుమార్ హిరాని నుండి పుష్ప కి కాంప్లిమెంట్స్ దక్కాయి.
ఇటివలే ‘పుష్ప’ చూసిన రాజ్ కుమార్ హిరాని సుకుమార్ కి మెసేజ్ పెట్టి పుష్ప రైటింగ్ , సన్నివేశాల గురించి అలాగే మ్యూజిక్ గురించి అభినందనలు తెలిపాడు. సినిమా చూడగానే చెప్పాలనుకున్నాను కానీ మీ నంబర్ దొరకలేదు. ఈ సినిమా గురించి చాలా మందితో మాట్లాడాను. ఇప్పుడే మీ నంబర్ దొరికింది అంటూ సుక్కు కి పెర్సనల్ మెసేజ్ పెట్టారు రాజు హిరాని. ఇక బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ నుండి ఇంత గొప్ప ప్రశంస రావడంతో సుక్కు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. కాస్త ఆలస్యంగా మీ మెసేజ్ చూశాను. మీ నుండి టెక్స్ట్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది మీ రైటింగ్ , మేకింగ్ నాకు ఆదర్శం అంటూ రిప్లై ఇచ్చాడు.
రాజ్ కుమార్ హిరాని , సుక్కు కన్వర్సేషణ్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు సుకుమార్. ఆగస్ట్ నుండి షూటింగ్ మొదలు కానుంది.
This post was last modified on June 11, 2022 8:22 am
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…