గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న #NBK107 సినిమా నుండి ఫస్ట్ హంట్ అంటూ టీజర్ రిలీజైంది. బాలయ్య పుట్టిన రోజు స్పెషల్ గా విడుదలైన ఈ టీజర్ నందమూరి అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. బాలయ్య నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో గోపీచంద్ మలినేని ఇందులో అన్నీ పొందుపరిచాడని టీజర్ చూస్తే తెలుస్తుంది.
గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ , పవర్ ఫుల్ డైలాగ్స్ , పొలిటికల్ సెటైర్లు , మేనరిజమ్స్ ఇలా అన్నీ ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. అయితే టీజర్ చూసాక బాలయ్య రజినీను గుర్తుచేసినట్టనిపించింది. అవును ఆ మధ్య రజినీ కాంత్ ‘కాలా’ అనే సినిమా చేశాడు. ముంబై మాఫియా నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాలో రజినీ గెటప్ అచ్చం ఇలానే ఉంటుంది. అటు ఇటుగా ఇప్పుడు బాలయ్య అదే గెటప్ లో కనిపించాడు.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, నల్ల పంచె , విగ్గు, చుట్ట గాల్లోకి ఎగరేసి నోట్లో పెట్టుకోవడం, ఇవన్నీ రజినీను గుర్తుచేసేలా ఉన్నాయి. ఇక ఇదే గెటప్ తో అప్పట్లో శివ రాజ్ కుమార్ కూడా కన్నడలో ఓ సినిమా చేశాడు. ఫస్ట్ లుక్ తో బాలయ్య శివ రాజ్ కుమార్ ని ఇప్పుడు టీజర్ తో రజినీను గుర్తుచేసి అదే లుక్ తో వచ్చాడు.
బాలయ్య లుక్ , యాక్షన్ ఎపిసోడ్స్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫస్ట్ హంట్ ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా బాలయ్య అభిమానులను బాగా సంతోష పెట్టింది. తన నుండి ఎలాంటి సినిమాలు ఆశిస్తారో బాలయ్య కి ‘అఖండ’ తో మరోసారి తెలిసింది. అందుకే అదే రూట్లో మాస్ యాక్షన్ సినిమాలే చేస్తున్నారు నందమూరి నటసింహం.
This post was last modified on June 9, 2022 8:16 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…