కొన్ని సినిమాలు స్క్రిప్టింగ్ లోనే ఆగిపోతుంటాయి. మరికొన్ని రెడీ టు షూట్ అనే స్టేజిలో ఉండగా క్యాన్సెల్ అవుతాయి. ఆ లిస్టులో యంగ్ హీరో నితిన్ సినిమా కూడా ఒకటుంది. అవును ‘పవర్ పేట’ అనే టైటిల్ తో సొంతం బేనర్ లో సినిమా చేయాలనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ కి కృష్ణ చైతన్య దర్శకుడు. సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించి రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనే ప్లాన్ కూడా వేశారు. నితిన్ తో పాటు మరో ఇంపార్టెంట్ రోల్ కోసం సత్య దేవ్ ని తీసుకున్నారు.
అంతా రెడీ షూట్ కి వెళ్ళడమే ఆలస్యం అనేలోపు సినిమా ఆగిపోయింది. అప్పటి నుండి ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు త్వరలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ? లేక పూర్తిగా క్యాన్సెల్ అయినట్టేనా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఆ సందేహాలకు తాజాగా సమాధానం ఇచ్చారు నితిన్ తండ్రి నిర్మాత సుధాకర్ రెడ్డి. ఆ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఫైనల్ వర్షన్ సరిగ్గా రాలేదు. అందుకే దాన్ని పక్కన పెట్టాం. ఆ ప్రాజెక్ట్ ఇక లేనట్టే అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక విక్రమ్ ని తెలుగులో రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని , ఈ సినిమా కోసం చాలా మంది పోటీ పడినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నందు వల్లే కమల్ గారు తనకి ఈ అవకాశం ఇచ్చారని పేర్కొన్నాడు. తక్కువ రేటుకే రైట్స్ ఇచ్చారని చెప్పుకున్నారు సుధాకర్ రెడ్డి. ఇక విక్రమ్ సక్సెస్ తర్వాత చాలా మంది తనకి కాల్ చేసి స్పెషల్ షో కోసం అడుగుతున్నారని చాలా మంది పెర్సనల్ గా చూశారని తెలిపాడు.
ఇక విక్రమ్ సీక్వెల్ రైట్స్ కూడా తనకే ఇవ్వనున్నారని విజయ్ తో లోకేష్ సినిమా అవ్వగానే సీక్వెల్ ఉంటుందని దాన్ని మరింత గ్రాండియర్ గా ప్లాన్ చేస్తున్నారని అన్నారు. ఇక నితిన్ మాచర్ల నియోజిక వర్గం షూటింగ్ 80 % కంప్లీట్ అయ్యిందని ఆగస్టులో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూట్ చేశామని అది వచ్చే ఏడాది రిలీజ్ ఉంటుందని చెప్పారు.
This post was last modified on June 9, 2022 5:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…