గత ఏడాది పెద్దన్న రూపంలో పెద్ద డిజాస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ తన 169వ సినిమాకు రెడీ అవుతున్నారు. డాక్టర్ తో బ్లాక్ బస్టర్ అందుకుని బీస్ట్ తో షాక్ తిన్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఆగస్ట్ నుంచి ప్రారంభించబోతున్నారు. ఇందులో చాలా విశేషాలున్నాయి. అందులో మొదటిది పన్నెండేళ్ల తర్వాత అందాల సుందరి ఐశ్యర్యరాయ్ రజనీకాంత్ తో జోడి కట్టనుంది.
రోబో బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించే అవకాశం దక్కలేదు. అందులోనూ ఐష్ పెళ్లి చేసుకున్నాక నటనకు బ్రేక్ తీసుకోవడంతో మనవాళ్లకు అందుబాటులో లేకుండా పోయారు. ఇందులో రజినికి భార్యగా కనిపించబోతున్నట్టు చెన్నై టాక్. అంతే కాదు రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర చేస్తున్నారు.
నరసింహలో నీలాంబరి టైపు పవర్ ఫుల్ క్యారెక్టరా లేక ఇంకేదయినా ప్రత్యేకంగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సూపర్ స్టారే స్వయంగా కథను సమకూర్చుకోగా ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ స్క్రీన్ ప్లే అందించారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఇది రూపొందనుంది.
అంతే కాదు ఈ మధ్య కాలంలో కోలీవుడ్ లో మంచి హిట్లు కొడుతున్న ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తనకు జోడిగా ఉండే యువనటుడు ఎవరో తెలియాల్సి ఉంది. కన్నడ సీనియర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. సంగీతం అనిరుద్ రవిచందర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ప్రీ ప్రొడక్షన్ స్టేజిలోనే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయేలా చేస్తున్న ఈ సినిమాను తలైవా కెరీర్ బెస్ట్ లో ఒకటిగా నిలుపుతానని నెల్సన్ హామీ ఇస్తున్నాడు. అభిమానులు కోరుకుంటున్నది కూడా అదే.
This post was last modified on June 7, 2022 2:52 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…