క్షణం, గూఢచారి, ఎవరు లాంటి చిత్రాలతో అడివి శేష్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించగలిగాడు. అదే ‘మేజర్’ మూవీకి పెద్ద ప్లస్ అయింది. ఏం చేసినా చాలా సిన్సియర్‌గా, నిజాయితీగా చేస్తాడని శేష్ మీద ఉన్న భరోసా.. 26/11 ఎటాక్స్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ అయిన ‘మేజర్’కు బాగా ప్లస్ అయింది. విడుదలకు పది రోజులు ముందు నుంచే ఇండియాలోని మేజర్ సిటీస్‌లో ప్రిమియర్లు వేయడం ఈ చిత్రంపై శేష్ అండ్ టీంకు ఉన్న నమ్మకాన్ని రుజువుగా నిలిచింది.
వాళ్ల నమ్మకానికి తగ్గట్లే సినిమాకు పాజిటివ్ టాక్, రివ్యూలు వచ్చాయి. ఓపెనింగ్స్ విషయంలోనూ ఈ సినిమా అదరగొట్టింది. శేష్ గత చిత్రానికి ఐదు రెట్లు తొలి రోజు వసూళ్లు రావడం విశేషం. ఐతే తొలి రోజు ఊపును కొనసాగిస్తూ.. వీకెండ్ అంతా అదరగొడుతోందీ చిత్రం. వసూళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు.
మామూలుగా డే-1 వసూళ్లతో పోలిస్తే రెండో రోజు ఎంతో కొంత డ్రాప్ ఉంటుంది. టాక్‌ను బట్టి 20 నుంచి 50 శాతం మేర వసూళ్లు తగ్గుతాయి. కానీ ‘మేజర్’ మాత్రం తొలి రోజుకు దీటుగా వసూళ్లు రాబట్టింది. రూ.11 కోట్ల దాకా వరల్డ్ వైడ్ గ్రాస్ తెచ్చుకుంది. మొత్తంగా రెండు రోజుల వసూళ్లు రూ.25 కోట్లకు చేరువగా ఉండడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ‘మేజర్’కు ఎదురే లేదు. హైదరాబాద్ సహా మేజర్ సిటీస్ అన్నింట్లో హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోందీ సినిమా. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరుగుతున్నాయి. ఒక పెద్ద హీరో సినిమా స్థాయిలో ఇది సత్తా చాటుతోంది.
యుఎస్‌లో కూడా సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. అక్కడ మిలియన్ మార్కు దిశగా సినిమా అడుగులు వేస్తోంది. హిందీలో తొలి రోజు 1.1 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ‘మేజర్’ రెండో రోజు ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేసింది. వసూళ్లు 50 శాతం మేర పెరిగాయి. రూ.1.65 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది. తమిళనాట ‘విక్రమ్’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అక్కడ ఈ సినిమా ప్రభావం పెద్దగా లేదు. కానీ కర్ణాటక, కేరళల్లో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ రన్లో ‘మేజర్’ రూ.50 కోట్ల మార్కును ఈజీగా దాటేయడం ఖాయం. శేష్ స్టార్ ఇమేజ్‌ను ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం గ్యారెంటీ.
This post was last modified on June 5, 2022 3:55 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…