ప్రతిభ ఏదోలా వికసిస్తుంది. విరాజిల్లుతుంది. కాకపోతే… అది బయటపడడానికి ఏదో ఓ మార్గం చూసుకోవాలి. ఇది వరకు సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలంటే… ఆల్బమ్‌లు పట్టుకుని తిరగాల్సిందే. ఆడిషన్ల కోసం క్యూలు కట్టాల్సివచ్చేది. ఆ తరవాత… షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ కర్ట్ లా కనిపించాయి. షార్ట్ ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచిన వాళ్లకు సినిమా ఆహ్వానాలు పలికేది. అదో వైల్డ్ కార్డ్ ఎంట్రీలా కనిపించేది. క్రమంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రభావమూ తగ్గింది.
ఇప్పుడంతా టిక్ టాక్ లదే హవా. చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, టిక్ టాక్ ఆప్ డౌన్‌లౌన్ చేసుకోవడం, తమ ప్రతిభనంతా అందులో చూపించేయడం. ఔత్సాహికులందరికీ ఇదో వరంలా మారింది. అందులో బోలెడంత చెత్త ఉండొచ్చు. ఓపిక పట్టి చూస్తే ప్రతిభావంతులూ కనిపిస్తారు. వాళ్లని వడబోసి పట్టుకోవడమే దర్శక నిర్మాతల పని. తాజాగా ఓ టిక్ టాక్ స్టార్ కి హీరోయిన్ ఛాన్స్ దొరికింది. తనే.. వర్షిణి. బన్నీ వాక్స్ పేరుతో ట్విట్టర్ లో ఫేమస్ అయ్యింది ఈ అమ్మాయి. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్.. టిక్ టాక్ ఫాలోవర్స్‌కి భలే నచ్చేస్తుంటాయి. అందుకే అందులో తాను స్టార్ అయిపోయింది. టిక్ టాక్‌నే ఇప్పుడు వర్షిణికి వెండి తెర ద్వారాలు తెరిచేలా చేసింది.
ఒక అనాథ లవ్ స్టోరీ అనే చిన్న సినిమాలో వర్షిణి హీరోయిన్‌గా ఎంపికైంది. చిన్నదో పెద్దదో… తనకంటూ ఓ ఛాన్స్ అయితే వచ్చిందిగా. యువ దర్శకులంతా ఇది వరకు ముంబై నుంచి కొత్త అమ్మాయిలు ఎవరొచ్చారా? అంటూ ఆరా తీసేవారు. ఇప్పుడు టిక్.. టాక్‌పై పడుతున్నారు. అంతే తేడా.
This post was last modified on June 24, 2020 8:27 pm
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…