Movie News

బాలీవుడ్‌కు మరో బిగ్ షాక్

ఓవైపు ఉత్తరాదిన సౌత్ సినిమాలు వసూళ్ల మోత మోగిస్తూ అక్కడి మార్కెట్లో ఆధిపత్యం చలాయిస్తుంటే.. మరోవైపు హిందీ చిత్రాలు తమ అడ్డాలో దారుణమైన ఫలితాలు అందుకుంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఆరు నెలల్లో ఒక్క ‘కశ్మీర్ ఫైల్స్’ మినహా ఏ బాలీవుడ్ పెద్ద సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపింది లేదు.

అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అజయ్ దేవగణ్, జాన్ అబ్రహాం లాంటి పెద్ద స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వీటిలో 83, రన్ వే 34, బచ్చన్ పాండే చిత్రాలకు మంచి టాక్ వచ్చినా ఫలితం లేకపోయింది. ఇక నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఎటాక్’ మూవీ అయితే అడ్రస్ లేకుండా పోయింది.

ఓవరాల్ రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్ పెద్ద సినిమాలకు ఓపెనింగ్స్ మరీ దారుణంగా వస్తుండటం పెద్ద షాక్. రన్ వే 34, ఎటాక్ చిత్రాలకు రూ.3-4 కోట్ల మధ్య వసూళ్లు రావడం అక్కడి ట్రేడ్ పండిట్లకు కూడా పెద్ద షాకే. ఇప్పుడు ఈ కోవలోని ఇంకో సినిమా చేరింది. అదే.. జయేష్ భాయ్ జోర్దార్.

యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో రణ్వీర్ సింగ్ లాంటి పెద్ద హీరో నటించిన సినిమా.. జయేష్ భాయ్ జోర్దార్. బాలీవుడ్ సినిమాలకు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా ఏమాత్రం ప్రభావం చూపుతుందో అని ముందు నుంచే సందేహాలు కలిగాయి. ఎందుకంటే ఇందులో హిందీ ప్రేక్షకులు ప్రస్తుతం కోరుకుంటున్న మాస్ అంశాలు కనిపించలేదు. ట్రైలర్ ఏమంత ఎగ్జైటింగ్‌గా లేదు. లో బజ్ మధ్య సినిమా రిలీజైంది. దీనికి తోడు బ్యాడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి పెద్ద షాకే తగిలింది.

తొలి రోజు ఇండియాలో కేవలం రూ.3 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందీ చిత్రం. నాలుగేళ్ల ముందు రణ్వీర్ నటించిన ‘సింబా’ తొలి రోజు రూ.20 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. అలాంటిది ఇప్పుడు తొలి రోజు అతడి సినిమా వసూళ్లు రూ.3 కోట్లకు పరిమితం కావడం చూస్తే.. కొవిడ్ అనంతర పరిస్థితుల్లో బాలీవుడ్ మార్కెట్ ఎంతగా దెబ్బ తిందో చెప్పడానికి రుజువు. స్టార్ ఇమేజ్ ఏమాత్రం వర్కవుట్ కాకపోవడం, రోజు రోజుకూ తమ సినిమలకు వసూళ్లు పడిపోతుండడం బాలీవుడ్‌ను అంతకంతకూ కలవరపాటుకు గురి చేస్తోంది.

This post was last modified on May 15, 2022 11:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

4 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

9 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

10 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

10 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

11 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

12 hours ago