Movie News

చిరు-మహేష్ ఫ్యాన్స్.. ఇది తగునా?

టాలీవుడ్లో ఫ్యాన్ వార్స్ రోజు రోజుకూ శ్రుతి మించిపోతున్నాయి. వాటి వల్ల ఎవరికీ ఏ నష్టం లేనపుడు సోషల్ మీడియాలో పడి ఎలా కొట్టుకున్నా ఓకే. కానీ ఈ వార్స్ వల్ల సినిమాలు దారుణంగా దెబ్బ తింటున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఒక సినిమాకు యుఎస్‌లో ప్రిమియర్ మొదలు కావడం ఆలస్యం.. అదే పనిగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయడానికి బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా దిగిపోతున్నారు. సినిమా రిలీజ్ కంటే ముందే ఇంటర్నెల్ టాక్ పేరుతో నెగెటివ్ టాక్ మొదలైపోతోంది. బుకింగ్స్ విషయంలోనూ ట్రోలింగ్ ఓ రేంజిలో చేస్తున్నారు. ఇక రిలీజ్ తర్వాత టాక్ కొంచెం అటు ఇటుగా ఉంటే ఇక అంతే సంగతులు.

పర్వాలేదు అనుకునే సినిమాలను కూడా డిజాస్టర్ అంటూ విపరీతంగా నెగెటివ్ ప్రచారాలు చేస్తున్నారు. ఒక పెద్ద హీరో సినిమా రిలీజైతే.. వేరే హీరోల అభిమానులందరూ ఒక్కటైపోతున్నారు. ఈ టైంలో ఒక్కటయ్యే అభిమానులు.. వారి వారి హీరోల సినిమాలు రిలీజైనపుడు వేరే వైపు టర్న్ తీసుకుంటున్నారు.

‘ఆచార్య’ సినిమా రిలీజైనపుడు నాన్-మెగా హీరోల అభిమానులంతా కలిసి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయగా.. ఇప్పుడు మహేష్ సినిమా ‘సర్కారు వారి పాట’ రిలీజైతే మెగా అభిమానులు లీడ్ తీసుకోగా నందమూరి, ఇతర హీరోల అభిమానులు వారికి తోడయ్యారు. ఇక్కడ ఎవరికి ఎవరూ మిత్రులు కాదన్నది స్పష్టం. కానీ హీరోల పరంగా చూస్తే వారిలో వారికి ఎలాంటి గొడవలూ లేవు.

ముఖ్యంగా చిరు, మహేష్‌ల బంధం ఎలాంటిది.. ఒకరి గురించి ఒకరు ఎంత గొప్పగా మాట్లాడతారు అనే విషయం మరిచిపోతున్నారు అభిమానులు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన చిరంజీవి.. మహేష్ గురించి ఎంత బాగా మాట్లాడాడో గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కూడా వేరే సందర్భాల్లో మహేష్‌ను కొనియాడాడు చిరు.

మహేష్ తన కొడుకు లాంటి వాడని కూడా ఆయనన్నారు. ఇక చిరంజీవి గురించి మహేష్ ఎప్పుడూ ఒక రేంజిలో చెబుతుంటాడు. తాను పెద్ద స్టార్ అయ్యాక కూడా టాలీవుడ్లో ఒకటి నుంచి పది స్థానాలు చిరంజీవివే అని మహేష్ చేసిన కామెంట్ అప్పట్లో సెన్సేషన్ అయింది. ఇప్పుడైనా చిరు గురించి మహేష్ గొప్పగానే మాట్లాడతాడు.

చిరు మీద అభిమానంతో ‘ఆచార్య’కు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి గమనార్హం. అలాంటిది ఆ సినిమాకు నెగెటివ్ స్ప్రెడ్ చేసిన వాళ్లలో మహేష్ అభిమానులు ఉన్నారన్నది మెగా అభిమానుల నమ్మకం. అందుకే ఇప్పుడు వాళ్లు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. కానీ ఎవ్వరూ కూడా తమ హీరోల మధ్య ఉన్న స్నేహాన్ని, ఒకరిపై ఒకరు చూపించే ప్రేమను గుర్తు చేసుకోవట్లేదు.

This post was last modified on May 15, 2022 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ బిగ్ బ్రేక్ ఇచ్చేసిన రాజమౌళి..

మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…

41 mins ago

ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ వైభవ్?

ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…

50 mins ago

మండ‌లిని ఇలా బ‌లోపేతం చేస్తున్నారు.. బాబు ఐడియా భేష్ ..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఐడియా వేస్తే.. తిరుగుండ‌దు. అది ఎన్నిక‌లైనా.. రాజ‌కీయాలైనా పాల‌న‌లో అయినా.. ఆయ‌న ఆలోచ‌న‌లు…

1 hour ago

గేమ్ ఛేంజర్ మీద ఒత్తిడి షురూ

పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…

2 hours ago

‘పుష్ప-2’ ఈవెంట్లో రభస రభస

‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…

3 hours ago