Movie News

మ‌హేష్ టీం డ్యామేజ్ కంట్రోల్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు య‌ధాలాపంగా అన్న ఒక మాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌కు ఎప్పుడు వెళ్తారు అంటూ మ‌హేష్ ఎప్పుడు మీడియాను క‌లిసినా విలేక‌రులు అడిగే ప్ర‌శ్ననే స‌ర్కారు వారి పాట ప్ర‌మోష‌న్ల‌లోనూ అడిగారు. దానికి మ‌హేష్ ఎప్ప‌ట్లా రొటీన్ స‌మాధానం చెప్ప‌కుండా.. బాలీవుడ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అక్క‌డి వాళ్లు న‌న్ను భ‌రించ‌లేరు అన్న‌ట్లుగా జ‌వాబివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

అస‌లే నార్త్ మార్కెట్లో సౌత్ సినిమాల దూకుడుతో బాలీవుడ్ వాళ్లు మంటెత్తిపోతున్నారు. అది చాల‌ద‌న్న‌ట్లు సుదీప్ లాంటి వాళ్లు బాలీవుడ్ వాళ్ల‌ను గిచ్చుతున్నారు. ఇలాంటి టైంలో మ‌హేష్ కూడా ఇలా కామెంట్ చేయ‌డం బాలీవుడ్ జ‌నాల‌కు, అక్క‌డి మీడియా వాళ్ల‌కు రుచించిన‌ట్లు లేదు. సెల‌బ్రెటీలెవ‌రూ నేరుగా స్పందించ‌క‌పోయినా.. అక్క‌డి మీడియా వాళ్లు మాత్రం మ‌హేష్ మీద నెగెటివ్ కామెంట్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఐతే ఎంతైనా నార్త్ మార్కెట్ చాలా పెద్ద‌ది. బాలీవుడ్‌కూ ఒక స్థాయి ఉంది.

అందులోనూ రేప్పొద్దున రాజ‌మౌళితో సినిమా చేశాక అది పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ‌వుతుంది. అప్పుడు ప్ర‌మోష‌న్ల కోసం ఉత్త‌రాదిన అంతా తిర‌గాలి. ఇప్ప‌టి మాట‌లు అప్పుడు ఇబ్బందిగా మార‌తాయేమో అని మ‌హేష్ అండ్ కో భ‌య‌ప‌డ్డ‌ట్లుంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ మొద‌లుపెట్టారు.

‘‘మ‌హేష్‌కు అన్ని భాష‌ల సినిమాల‌పై గౌర‌వం ఉంది.. అన్ని భాష‌లూ, అన్ని ఇండ‌స్ట్రీలూ ఆయ‌న‌కు స‌మాన‌మే. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు సినిమాలు చేస్తుండ‌టం వ‌ల్ల ఇవి అయితే త‌న‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంటాయ‌ని మాత్రమే ఆయ‌న చెప్పారు. ఆయ‌న మాట‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు’’.. అంటూ వివ‌ర‌ణ ఇచ్చింది మ‌హేష్ పీఆర్ టీం. రాజ‌మౌళితో మ‌హేష్‌ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ‌వ‌బోతోంద‌ని కూడా ఈ టీం ప్ర‌స్తావించ‌డాన్ని బ‌ట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ డ్యామేజ్ కంట్రోల్ అన్న‌ది స్ప‌ష్టం.

This post was last modified on May 12, 2022 6:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

10 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

40 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago