బాణం, సోలో, నా ఇష్టం, సన్నాఫ్ సత్యమూర్తి, ప్రతినిధి, ఒక్కడినే.. ఈ సినిమాలన్నింట్లో శ్రీ విష్ణు నటించాడని చాలామందికి గుర్తు లేకపోవచ్చు. ఆ సినిమాల్లో అతణ్ని చూసి తనూ హీరో అవుతాడని, హిట్లు కొడతాడని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఒకప్పుడు మంచి ఫాంలో కనిపించిన నారా రోహిత్ అండగా నిలవడం, అలాగే సొంత టాలెంట్ కూడా ప్లస్ కావడంతో తర్వాత అతను హీరోగా అవకాశాలు అందుకున్నాడు.
అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నాని ఒకే కథ, బ్రోచేవారెవరురా లాంటి విజయాలతో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు. విష్ణు సినిమాలంటే ఏదో ఒ విశేషం ఉంటుంది, వైవిధ్యం చూపిస్తాడు అనే భరోసాను అతను ప్రేక్షకుల్లో తీసుకురాగలిగాడు. కాకపోతే మాస్ ఇమేజ్ లేకపోవడం వల్ల అతడి సినిమాలకు టాక్‌ను బట్టే వసూళ్లు వస్తాయి తప్ప.. ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో ఉండవు. ఇది అతడికి మైనస్.
ఐతే ఇన్నాళ్లూ ఒక సినిమా అటు ఇటు అయినా ఇంకో సినిమాతో హిట్ కొడుతుండటం.. డిఫరెంట్ సినిమాలు చేస్తాడని తనకున్న పేరును నిలబెట్టుకుంటూ వస్తుండటంతో బండి బాగానే నడుస్తుండేది కానీ.. ఈ మధ్య అతడి పేరు దెబ్బ తింటోంది. జడ్జిమెంట్ తేడా కొడుతోంది. బ్రోచే వారెవరురా తప్ప అతడికి సరైన విజయం లేదు. తిప్పరా మీసం, గాలి సంపత్, అర్జున ఫల్గుణ అతడికి దారుణమైన ఫలితాన్నందించాయి. రాజ రాజ చోర ఒక్కటి పర్వాలేదనిపించింది. అది కూడా విష్ణు చెప్పిన స్థాయిలో లేదు. ‘అర్జున ఫల్గుణ’ చూసి విష్ణు ఇంత పేలవమైన సినిమా ఎలా చేశాడో జనాలకు అర్థం కాలేదు. అతడి క్రెడిబిలిటీని ఆ చిత్రం బాగా దెబ్బ తీసింది.
ఇప్పుడు రిలీజైన ‘భళా తందనాన’ దాంతో పోలిస్తే బెటర్ అనే తప్ప.. ఈ సినిమాలోనూ పెద్దగా విషయం లేదు.
మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి అతను తప్పటడుగు వేసినట్లున్నాడు. ఉన్నంతలో విష్ణు తన పాత్రకు న్యాయం చేసినా ఎవరైనా మాస్ హీరో చేయాల్సిన పాత్ర అది. తనకు అంతగా నప్పలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. విష్ణు ఖాతాలో మరో ఫ్లాప్ జమ అయింది. ఓవైపు వరుస ఫ్లాపులు, మరోవైపు ఈ చిత్రాల్లో తన అభిరుచీ కనిపించకపోవడంతో శ్రీవిష్ణు కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే కనిపిస్తోంది. ఇంత త్వరగా అతడి కెరీర్ ఇలా తిరగబడుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
This post was last modified on May 9, 2022 4:28 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…