మహేష్ బాబు హీరోగా పరశురాం డైరెక్షన్ లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ హంగామా మొదలైంది. సాంగ్స్ రిలీజ్ ఓ వైపు టీం ఇంటర్వ్యూలు మరో వైపు జరుగుతున్నాయి. దర్శకుడు పరశురాం మీడియాకి ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమా గురించి కొన్ని విశేషాలు షేర్ చేసుకుంటున్నాడు. సర్కారు వారి పాట మీద ఆడియన్స్ కి ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాదానం ఇచ్చాడు.
సినిమలో ఎలాంటి సందేశం ఉండదని ఇది పక్కా కమర్షియల్ సినిమా అని క్లారిటీ ఇచ్చాడు. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కథ కూడా ఉంటుందని చెప్పుకున్నాడు. ఇక బ్యాంకుల గురించి కేవలం టాపిక్ మాత్రమే ఉంటుంది తప్ప ఎలాంటి సెటైర్లు ఉండవని పేర్కొన్నాడు. మహేష్ కేరెక్టర్ కి కనెక్ట్ అవుతూ అందులో తమని చూసుకుంటారని తెలిపాడు.
ఇక గోపి సుందర్ ని కాదని తమన్ ని పెట్టుకోవడం గురించి కూడా స్పందించాడు పరశురాం. ఆ టైంలో గోపి సుందర్ చాలా బిజీగా ఉన్నాడని ఏడెనిమిది సినిమాలు చేస్తున్నాడని అందుకే తమకి టీం ఇచ్చి అప్పటికప్పుడు సినిమాకి ట్యూన్స్ చేసిచ్చే తమన్ ని తీసుకున్నామని అన్నారు. ఇక కీర్తి ని రెండేళ్ళ క్రితం కథ అనుకున్నప్పుడే ఫిక్స్ అయ్యానని, ఆ పాత్రకు తనే పర్ఫెక్ట్ అని ఆడియన్స్ ఫీలవుతారని చెప్పుకున్నాడు.
సో సర్కారు వారి పాటలో మహేష్ క్లాసులు పీకుతూ సందేశాలు ఇవ్వడని క్లారిటీ ఇచ్చేశాడు పరశురాం. ఇక సినిమా రిలీజ్ తర్వాత పెద్ద హిట్ అవుతుందని చాలా నమ్మకంతో ఉన్నాడు పరశురాం. ఇన్నాళ్ళకి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఓ పెద్ద స్టార్ హీరో దొరికాడు. ఇక మహేష్ తో సాదా సీదా సినిమా చేస్తాడా మంచి కంటెంట్ తో తీసి ఉంటాడు. ఇప్పటికే ట్రైలర్ సినిమా మీద మంచి బజ్ తీసుకొచ్చి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసింది. మరి మే 12న ఈ సినిమాతో పరశురాం దర్శకుడిగా ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాల్సిందే.