అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న థాంక్ యు రిలీజ్ డేట్ లాక్ అయినట్టుగా ఫిలిం నగర్ అప్డేట్. జూలై 7 విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారట. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ ఎందుకో దీని తాలూకు సమాచారాన్ని ఇవ్వడంలో ఎస్విసి సంస్థ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఈలోగా హీరో నాగ చైతన్య దర్శకుడు విక్రమ్ కుమార్ లు తమ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దూత వెబ్ సిరీస్ ని చకచకా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇటీవలే అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చారు.
థాంక్ యుకి జూలై 7 అనుకూలమైన తేదీనే. ఇంకా రెండు నెలలు టైం ఉంది కాబట్టి ప్రమోషన్లు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మరుసటి రోజే నితిన్ మాచర్ల నియోజకవర్గం రాబోతోంది. 8న విడుదల చేయబోతున్నట్టు చాలా రోజుల క్రితమే అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు వందల కోట్ల భారీ ప్రాజెక్టులు కాదు కాబట్టి పోటీ పడటంలో రిస్క్ ఏమి లేదు కానీ సరిగ్గా దీనికి వారం ముందు జూలై 1న పక్కా కమర్షియల్, రంగ రంగ వైభవంగా, రాకెట్రీలు వచ్చేసి ఉంటాయి. సో కాంపిటీషన్ తక్కువేమి లేదు.
రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన థాంక్ యులో చాలా ఆకర్షణలున్నాయి. ఇందులో చైతు హార్డ్ కోర్ మహేష్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు. దీనికోసమే ప్రత్యేకంగా ఒక్కడు పోకిరి కటవుట్లు వేసి షూటింగ్ చేశారు. ఉయ్యాలా జంపాల ఫేమ్ అవికా గోర్ మరో ముఖ్యమైన పాత్ర చేస్తోంది. తమన్ సంగీతం స్పెషల్ అట్రాక్షనని వేరే చెప్పనక్కర్లేదు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకులు పిసి శ్రీరామ్ కెమెరా బాధ్యతలు నిర్వహించారు. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా కంటెంట్ చాలా గట్టిగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఇంతకంటే ఫ్యాన్స్ కి ఏం కావాలి
This post was last modified on May 6, 2022 5:06 pm
జనసేనకు శుక్రవారం అత్యంత కీలకమైన రోజు. పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి 11 ఏళ్లు పూర్తి కానున్నాయి.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని…
ఫ్లాపుల నుంచి ఉపశమనం పొందుతూ 'క' రూపంలో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి దిల్ రుబాగా ప్రేక్షకుల…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నిత్యం…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి…
తెలంగాణ అసెంబ్లీలో గురువారం చోటుచేసుకున్న రచ్చ… బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో కలకలం…
ఖుషి తర్వాత స్క్రీన్ పై కనిపించకుండా పోయిన సమంతా తిరిగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన…