ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే.. ‘ఆర్ఆర్ఆర్’యే. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకులను పలకరించింది. ఆరంభంలో కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినా సరే.. తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించిందీ రాజమౌళి సినిమా.
రిలీజై నెల రోజులు దాటినా ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ ఓ మోస్తరుగా కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ఒక్క ‘కేజీఎఫ్-2’ మినహా ఆ చిత్రానికి గత ఐదు వారాల్లో పోటీ ఇచ్చిన సినిమానే లేదు. గత శని, ఆదివారాల్లో.. రంజాన్ రోజైన మంగళవారం ఈ చిత్రానికి అక్కడక్కడా ఫుల్స్ పడటం విశేషం.
కొన్ని సెంటర్లలో ఈ చిత్రం 50 రోజుల ప్రదర్శనను కూడా పూర్తి చేసుకోబోతోంది. ఆ వెంటనే డిజిటల్ రిలీజ్ వెళ్లబోతోంది ‘ఆర్ఆర్ఆర్’. విశ్వసనీయ సమాచారం ప్రకారం మే 20న ‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ ప్రిమియర్స్ ఉండబోతున్నాయి. ఇందుకు సన్నాహాలు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది.
థియేట్రికల్ రిలీజ్‌కు చాన్నాళ్ల ముందే, గత ఏడాదే ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ డీల్ పూర్తయింది. హిందీ వెర్షన్ హక్కులను నెట్ ఫ్లిక్స్‌కు, మిగతా అన్ని వెర్షన్ల రైట్స్ జీ5 సంస్థకు రాసిచ్చేశారు. దాదాపు రూ.350 కోట్ల మేర ఈ హక్కులు పలికాయి. రిలీజ్ తర్వాత 50 రోజులకు సినిమాను ఓటీటీల్లోకి తెచ్చేలా ఒప్పందం కుదిరింది.
ఈ సినిమాకున్న హైప్, బాక్సాఫీస్ దగ్గర సాధించిన భారీ విజయం దృష్ట్యా.. థియేట్రికల్ రిలీజ్ తరహాలోనే డిజిటల్ రిలీజ్ విషయంలోనూ హంగామాను చూడబోతున్నట్లే. రిపీట్ వాల్యూ ఉన్న సినిమా కావడంతో డిజిటల్ రిలీజ్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
టికెట్ల ధరలు ఎక్కువ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్, రిపీటెడ్‌గా సినిమా చూసే ప్రేక్షకులు అనుకున్నంత స్థాయిలో సినిమా చూడలేదనే చెప్పాలి. ఆల్రెడీ చూసిన వాళ్లు కూడా మళ్లీ ఒకసారి సినిమాపై ఓ లుక్కేసే అవకాశం ఉండటంతో డిజిటల్‌లోనూ సినిమాకు మంచి హైప్ రావడం, వ్యూస్ పరంగా రికార్డులు సృష్టించడం గ్యారెంటీ.
This post was last modified on May 4, 2022 6:02 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…