ఇండియన్ ఫిలిం హిస్టరీలో బెస్ట్ కొరియోగ్రాఫర్ ఎవరు అని అడిగితే.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అందరూ చెప్పే ఒకే మాట.. ప్రభుదేవా. అతడి డ్యాన్స్ కొరియోగ్రఫీల్లో ఉండే అందం, స్టైల్, గ్రేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 90 దశకాల్లో ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన పాటలు ఇప్పుడు చూసినా వారెవా అనిపిస్తాయి. సౌత్ చిత్రాలతో పాటు హిందీలోనూ కొన్ని పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీతో తన ప్రత్యేకతను చాటుకున్నాడతను.
ఐతే ఎంత గొప్ప మాస్టర్ అయినా.. అతడి స్టెప్పులను ఎలివేట్ చేసే హీరో ఉండటం కూడా కీలకం. ప్రభుదేవాకు అంత మంచి పేరు రావడానికి పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కారణం. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు సహా ఎన్నో చిరు సినిమాలకు అద్భుతమైన కొరియోగ్రఫీతో అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది చిరు-ప్రభుదేవా జోడీ. ఈ కలయికలో వచ్చిన ప్రతి పాటా ఒక కల్ట్ క్లాసిక్ అనడంలో సందేహం లేదు.
ఐతే ఒక దశ దాటాక ప్రభుదేవా కొరియోగ్రఫీ వదిలేసి నటన, దర్శకత్వం మీద వెళ్లిపోవడంతో మళ్లీ చిరు-ప్రభుదేవా కలయికలో పాటలు చూసే అవకాశం లేకపోయింది. ఐతే చాలా ఏళ్ల విరామం తర్వాత ఈ జోడీ మళ్లీ మెరవబోతోంది. చిరు కొత్త చిత్రం ‘గాడ్ ఫాదర్’లో ఒక పాటకు ప్రభుదేవా నృత్యరీతులు సమకూర్చబోతున్నాడు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ వెల్లడించాడు. చిరు, ప్రభుదేవా, దర్శకుడు మోహన్ రాజాలతో తాను కలిసి ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఈ గ్రేట్ కాంబినేషన్ రిపీటవుతున్న విషయాన్ని ధ్రువీకరించాడు.
గత కొన్నేళ్లలో ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన పాటలు చాలా చాా తక్కువ. కానీ రౌడీ బేబీ లాంటి కొన్ని పాటలతోనే ప్రభుదేవా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇటీవలే అతను వడివేలు నటిస్తున్న ఓ సినిమాలో ఒక సరదా పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశాడు. ఇప్పుడు మెగాస్టార్‌తో ప్రభుదేవా జట్టు కడుతుండటంతో ఒక స్పెషల్ సాంగ్ చూడబోతున్నామని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు.
This post was last modified on May 3, 2022 7:38 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…