చైతన్య లవ్ స్టోరీ నెక్స్ట్ ఇయరే!

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ స్టోరీ చిత్రం షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి టీమ్ లో చాలా మంది ఇప్పుడు సిద్ధంగా లేనట్టు తెలిసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యారట. అంటే సెప్టెంబర్ తర్వాతే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళవచ్చు.

శేఖర్ కమ్ముల కాస్త స్లోగా తీస్తాడు కనుక సినిమా పూర్తి కావడానికి నవంబర్ లేదా డిసెంబర్ అవుతుంది. కాబట్టి ఈ చిత్రం ఈ ఏడాది రాదనే చెప్పుకుంటున్నారు. మరి వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తారో లేక వేసవి వరకు వేచి చూస్తారో తెలీదు. ఈ చిత్రం పట్ల ఫాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

చైతన్య కెరీర్ బెస్ట్ అవుతుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా చూసేందుకు చాలా కాలం ఎదురు చూడక తప్పదు.