తమిళ టాప్ స్టార్ విజయ్‌కి చాలా ఏళ్ల నుంచి ఫ్లాప్ అన్నదే లేదు. యావరేజ్, డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఇరగాడేసి అతడి స్టార్ పవర్‌ను రుజువు చేశాయి. మాస్టర్, బిగిల్, మెర్శల్, తెరి.. ఇవన్నీ కూడా కొంత మేర డివైడ్ టాక్ తెచ్చుకున్నవే. కానీ ఆ టాక్ వాటి బాక్సాఫీస్ సక్సెస్ మీద ప్రభావం చూపలేదు. విజయ్ కొత్త సినిమా ‘బీస్ట్’కు వీటితో పోలిస్తే ఎక్కువగా నెగెటివ్ టాక్ వచ్చింది.
కానీ సినిమా మీద ఉన్న హైప్, విజయ్ స్టార్ ఇమేజ్ కలిసి ఈ సినిమాను హిట్ చేసేస్తాయని అనుకున్నారు. కానీ దీనికి పోటీగా రిలీజైన ‘కేజీఎఫ్-2’ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దాని దెబ్బకు విజయ్ సినిమా కుదేలైంది. చివరికి ఈ చిత్రం ఫ్లాప్ అని తేలిపోయింది. ఈ రిజల్ట్‌కు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమారే కారణమంటూ విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడిని నమ్మి విజయ్ ఛాన్సిస్తే ఇలాంటి సినిమా తీశాడేంటని అతణ్ని తిడుతున్నారు.
ఐతే మామూలు అభిమానులు విమర్శించడం మామూలే కానీ.. స్వయంగా విజయ్ తండ్రే నెల్సన్ మీద తీవ్ర విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. విజయ్ తండ్రి చంద్రశేఖరన్ తమిళంలో పేరున్న దర్శకుడు, నిర్మాత. ఆయన ఓ ఇంటర్వ్యూలో ‘బీస్ట్’ రిజల్ట్ మీద మాట్లాడారు. నెల్సన్ మంచి ఛాన్స్‌ను దుర్వినియోగం చేశాడని ఆయన అభిప్రాయపడ్డారు. యువ దర్శకులకు పెద్ద స్టార్లు ఛాన్స్ ఇవ్వగానే వాళ్లు తమ శైలిని పక్కన పెట్టి ఆ హీరో ఇమేజ్ మీద ఆధారపడతారని, ఎలివేషన్లకే పరిమితం అవుతారని, ఇది పెద్ద తప్పని ఆయన అన్నారు.
నెల్సన్ తన శైలిలో సినిమా తీసి, కమర్షియల్ అంశాలు, హీరో ఎలివేషన్లు జోడించి ఉండాల్సిందని, అలా కాకుండా అతను విజయ్ ఇమేజ్ మీదే దృష్టిపెట్టాడని.. విజయ్ ఎంత కష్టపడ్డా సినిమాను కాపాడలేకపోయాడని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రశేఖరన్ మామూలుగా కొంచెం ఔట్ స్పోకెన్ అయినప్పటికీ ఇలా సినిమా థియేటర్లలో ఉండగా ఇలా దర్శకుడి మీద విమర్శలు గుప్పించడాన్ని తప్పుబడుతున్నారు.
This post was last modified on April 20, 2022 9:26 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…