Movie News

ఎందుకొచ్చిన ఇగో.. వాయిదా వేసేద్దాం

తెలుగు క్లాసిక్ ‘జెర్సీ’ హిందీ రీమేక్‌ను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేశారు. చివరగా డిసెబరు 31న విడుదలకు సన్నాహాలన్నీ పూర్తయ్యాక కరోనా మూడో వేవ్ ఉద్ధృతి పెరగడంతో రిలీజ్2కు ఇంకో మూడు రోజులుండగా సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 14కు కొత్త డేట్ ఎంచుకున్నారు. ఇదే తేదీకి ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ లాంటి క్రేజీ మూవీ వస్తున్నప్పటికీ.. తమ సినిమా మీద నమ్మకంతో ఉన్నారు జెర్సీ మేకర్స్.

రిలీజ్ డేట్ ఇంకోసారి ఖరారు చేసి ముందుకెళ్లడానికే సిద్ధపడ్డారు. కొన్ని చోట్ల బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఐతే రెస్పాన్స్ అంత బాగా ఏమీ లేదు. అదే సమయంలో ‘కేజీఎఫ్-2’కు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. హిందీ బెల్ట్‌లో పెట్టిన టికెట్లు పెట్టినట్లే అయిపోతున్నాయి. దీంతో ‘జెర్సీ’ మేకర్స్‌లో కంగారు తప్పలేదు. ‘పుష్ప’ దెబ్బకు ‘83’.. ‘ఆర్ఆర్ఆర్’ ధాటికి ‘ఎటాక్’ ఎలా అల్లాడిపోయాయో చూశాక.. ఇగోకు పోయి రిలీజ్ చేస్తే మొదటికే మోసం వస్తుందని భయపడ్డట్లున్నారు ‘జెర్సీ’ నిర్మాతలు.

ఈ నెల 14 నుంచి 21కి ‘జెర్సీ’ని వాయిదా వేస్తూ ఈ చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. సినిమాను ఇంత కాలం ఆపి ‘కేజీఎఫ్-2’కు బలి ఇవ్వడం ఎందుకనే వెనక్కి తగ్గారన్నది స్పష్టం. పదుల కోట్లు ముడిపడ్డ విషయంలో ఇగోకు వెళ్లడం కరెక్ట్ కాదనుకున్నారు ‘జెర్సీ’ మేకర్స్. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని వారం రోజులే వాయిదా వేశారు. ‘కేజీఎఫ్-2’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చూసి ఇంకో వారం సినిమాను వాయిదా వేసినా ఆశ్చర్యం లేదేమో.

‘జెర్సీ’ హిందీ నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు కావడం విశేషం. అలాగే ‘జెర్సీ’ ఒరిజినల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీకి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. వీరితో కలిసి అమన్ గిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో నాని, శ్రద్ధ శ్రీనాథ్ చేసిన పాత్రలను అక్కడ షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ పోషించారు. తెలుగు వెర్షన్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరినే హిందీలోనూ డైరెక్ట్ చేశాడు. షాహిద్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లాగే ‘జెర్సీ’ కూడా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే భరోసా ఉన్నప్పటికీ రిలీజ్ టైమింగ్ తేడా కొట్టకూడదనే సినిమాను వాయిదా వేశారన్నది స్పష్టం.

This post was last modified on April 11, 2022 1:02 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

7 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

8 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

8 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

8 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

9 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

10 hours ago