కరోనా మహమ్మారి ప్రభావం నుంచి బయటపడి ఇండియన్ బాక్సాఫీస్ బాగానే పుంజుకుంటోంది. ముఖ్యంగా సౌత్ సినిమాలు షేకాడించేస్తున్నాయి. గత డిసెంబరులో అఖండ, పుష్ప సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. థర్డ్ వేవ్ చిన్న బ్రేక్ ఇచ్చాక.. మళ్లీ మన బాక్సాఫీస్ బాగానే ఊపందుకుంది. ముందుగా భీమ్లా నాయక్ జోష్ తీసుకొస్తే.. గత రెండు వారాలుగా ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సాగిస్తోంది.
హిందీలో ఈ మధ్య కశ్మీర్ ఫైల్స్ సినిమా వసూళ్ల మోత మోగించింది. మిగతా భాషల్లోనూ కొన్ని సినిమాలు బాగా ఆడాయి. ఐతే వచ్చే వారం మొత్తంగా ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా థియేటర్లు కళకళలాడబోతున్నాయి. వసూళ్ల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బంపర్ క్రేజ్ మధ్య కేజీఎఫ్-2 రిలీజ్ కానుంది. ఆ సినిమాకు ఆ భాష, ఈ భాష.. ఆ ఏరియా, ఈ ఏరియా అని తేడా లేకుండా అంతటా క్రేజ్ ఉంది.
హిందీలో ఈ సినిమాకు ఆల్రెడీ ఒక రేంజిలో జరుగుతున్నాయి అడ్వాన్స్ బుకింగ్స్. దీంతో పాటుగా హిందీలో జెర్సీ లాంటి క్రేజీ మూవీ రాబోతోంది. ఈ సినిమా మీదా మంచి అంచనాలే ఉన్నాయి. నార్త్ ఇండియా అంతటా ఈ సినిమాలకు భారీ వసూళ్లు గ్యారెంటీ. ఇక కేజీఎఫ్-2 దక్షిణాదిన కూడా బాక్సాఫీస్‌లో ప్రభంజనం సృష్టించడం గ్యారెంటీ.
దీంతో పాటుగా విజయ్ సినిమా బీస్ట్ కూడా భారీ అంచనాల మధ్య రాబోతోంది. దానికీ సౌత్‌లో భారీ వసూళ్లుంటాయి. ఇక ఆర్ఆర్ఆర్ సైతం ఇప్పుడే రన్ ముగించేలా కనిపించడం లేదు. అది వచ్చే వారం కూడా మంచి వసూళ్లే రాబట్టే ఛాన్సుంది. మిగతా సినిమాల ఓవర్ ఫ్లోస్ దీనికి కలిసి రావచ్చు. మొత్తంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ సునామీ చూడబోతున్నట్లే
This post was last modified on April 10, 2022 2:53 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…