‘బాహుబలి’తో పోలిస్తే కంటెంట్ పరంగా ‘ఆర్ఆర్ఆర్’ వీక్ అనే చెప్పాలి. రాజమౌళి సినిమాలో చాలా కాలం తర్వాత చాలా లోపాలు వెతుకుతున్నది ఈ చిత్రానికే. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు కూడా. ఐతేనేం బాక్సాఫీస్ దగ్గర ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనమే సృష్ణిస్తోంది. ‘బాహుబలి-2’ రికార్డులను కూడా బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్తోంది. రెండో వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ దాదాపు రూ.900 కోట్ల కలెక్షన్లు రాబట్టడం విశేషం.
రెండో శనివారం ఉగాది సెలవు కావడం, తర్వాతి రోజు ఆదివారం కావడంతో ఈ రెండు రోజుల్లో తొలి వీకెండ్‌కు దీటుగా కలెక్షన్లు రాబట్టింది ‘ఆర్ఆర్ఆర్’. రెండో వారంలో ఈ దూకుడేంటి బాబోయ్ అని అందరూ తలలు పట్టుకున్నారు. టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది ఈ రెండు రోజుల్లో. ఐతే వారాంతం అయ్యాక ‘ఆర్ఆర్ఆర్’ చల్లబడిపోతుందని అనుకున్నారు.
కానీ అలా ఏమీ జరగలేదు. అందుక్కారణం దిగి వచ్చిన టికెట్ల ధరలు.సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీతోనే నడిచింది ‘ఆర్ఆర్ఆర్’. వీకెండ్‌తో పోలిస్తే కలెక్షన్లు తగ్గాయి కానీ.. డ్రాప్ మరీ ఎక్కువేమీ లేదు. ‘ఆర్ఆర్ఆర్’కు తొలి మూడు రోజులు భారీగా ఉన్న టికెట్ల ధరలను.. వీకెండ్ తర్వాత కొంత మేర తగ్గించారు. ఇప్పుడు రెండో వీకెండ్ అయ్యాక మరింతగా రేట్లు తగ్గాయి. సాధారణంగా వేరే సినిమాలకు ఏ స్థాయిలో ఉంటాయో ఈ చిత్రానికి కూడా అవే ధరలతో టికెట్లు అమ్ముతున్నారు.
దీంతో రేట్లు ఎక్కువ అని సినిమాకు దూరంగా ఉన్న ప్రేక్షకులు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు థియేటర్లకు కదులుతున్నారు. రెండోసారి సినిమా చూడాలనుకున్న వాళ్లకు కూడా ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీని వల్లే ‘ఆర్ఆర్ఆర్’ ఆక్యుపెన్సీ పడిపోలేదు. చూస్తుంటే మూడో వీకెండ్ అయ్యే వరకు ‘ఆర్ఆర్ఆర్’ జోరు కొనసాగేలాగే కనిపిస్తోంది. వచ్చే వారం ‘బీస్ట్’, ‘కేజీఎఫ్-2’ సినిమాలు వచ్చాక కానీ ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ రన్ ముగియకపోవచ్చు.
This post was last modified on April 5, 2022 8:15 pm
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…