తమిళంలో గత కొన్నేళ్లుగా విజయ్ హవా మామూలుగా లేదు. అతను రజినీకాంత్‌ను మించిన స్టార్ అయిపోయాడు. యావరేజ్ సినిమాలతోనే బ్లాక్‌బస్టర్లు కొడుతూ ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతున్నాడతను. గత ఏడాది వచ్చిన మాస్టర్ మూవీ యావరేజే అయినా అది బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది.
ఇప్పుడతను కోలమావు కోకిల, డాక్టర్ లాంటి సూపర్ హిట్లు తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించిన బీస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసినపుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ తర్వాత దీని పాటలు, ఇతర ప్రోమోలు అంచనాల్ని ఇంకా పెంచాయి. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ హీరోయిజాన్ని వాడుకుంటూ నెల్సన్ తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాడని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది.
బీస్ట్ మూవీ ఒక షాపింగ్ మాల్ హైజాక్ నేపథ్యంలో నడుస్తుందని ఇంతకుముందే సంకేతాలు అందాయి. ట్రైలర్లో అదే చూపించారు. ఒక హైజాక్ గ్యాంగ్ చెన్నైలోని ఒక పెద్ద షాపింగ్ మాల్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటుంది. ఐతే ఆ మాల్‌లో అనుకోకుండా హీరో కూడా ఉంటాడు. అతను ఇంటలిజెన్స్ విభాగంలో పని చేసే స్పై. అతడి ట్రాక్ రికార్డు మామూలుగా ఉండదు. అలాంటోడు బందీల మధ్య ఉండటంతో హైజాకర్లకే సవాల్ మొదలవుతుంది. మాల్‌లో ఉన్న అందరినీ హీరో ఎలా రక్షించాడనే నేపథ్యంలోనే కథ రొటీన్‌గా నడిచేలా కనిపిస్తున్నా.. దిలీప్ మార్కు ఫన్‌కు ఢోకా లేనట్లే ఉంది.
నెల్సన్ తొలి రెండు చిత్రాల్లో కామెడీతో అదరగొట్టిన యోగిబాబు ఇందులోనూ కీలక పాత్ర చేశాడు. ఇక హీరోయిన్ గ్లామర్ సినిమాకు మరో అట్రాక్షన్. సూపర్ ఫాంలో ఉన్న విజయ్.. ఈ సినిమాలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అతడి నుంచి అభిమానులు ఆశించే హీరోయిజం, యాక్షన్‌కు సినిమాలో ఢోకా లేనట్లే కనిపిస్తోంది. కాకపోతే పూర్తిగా షాపింగ్ మాల్‌లో నడిచే కథను బోర్ కొట్టకుండా ఎలా నడిపిస్తారన్నదే డౌటు. ఈ నెల 13న బీస్ట్ తమిళంతో పాటు తెలుగులోనూ పెద్ద ఎత్తునే రిలీజ్ కానుంది.
This post was last modified on April 3, 2022 9:09 am
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…